చిత్రీకరణ తుది దశలో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ చిత్రం

చిత్రీకరణ తుది దశలో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ చిత్రం

వైవిధ్యమైన పాత్రలతో తనదైన గుర్తింపు సంపాదించుకున్న నందమూరి కథానాయకుడు.. డైనమిక్ స్టార్ నందమూరి కళ్యాణ్ రామ్. రీసెంట్‌గా విడుద‌లైన బింబిసార చిత్రంతో సెన్సేష‌న‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్‌ను సాధించిన క‌ళ్యాణ్ రామ్ హీరోగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. నందమూరి కళ్యాణ్ రామ్ 19వ చిత్రమిది. రాజేంద్ర రెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న ఈ చిత్రాన్ని న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్ నిర్మిస్తున్నారు.

లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ నవంబర్ 4న విడుదల

క‌ళ్యాణ్ రామ్ స‌ర‌స‌న ఆషిక రంగ‌నాథ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. రీసెంట్‌గా జరిగిన గోవా షెడ్యూల్‌తో దాదాపు సినిమా పూర్తయ్యింది. చివరి షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానుంది. జిబ్రాన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి ఎస్‌.సౌంద‌ర్ రాజ‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేశారు. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల‌ను తెలియ‌జేస్తామ‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది.

follow us