“అక్షర” మూవీ రివ్యూ..!

nanditha swetha akshara movie review and rating
nanditha swetha akshara movie review and rating

దర్శకుడు చిన్ని కృష్ణ డైరెక్షన్ లో నందిత శ్వేత ప్రధాన పాత్ర పోషించిన సినిమా “అక్షర”. ఈ సినిమా ప్రస్తుత విద్యావ్యవస్థ లో ఉన్న లోపాలు..విద్యా వ్యవస్థలో కార్పొరేట్ దోపిడీ ప్రధాన అంశంగా తీసుకుని సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను అలరించాగా… సినిమా కోసం పలువురు సెలబ్రెటీ లు చేసిన ప్రమోషన్స్ తో సినిమాపై హైప్ క్రేయేట్ అయ్యింది. అంతే కాకుండా ఎమ్మెల్సీ కవిత కూడా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొని ప్రశంసలు కురిపించడంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. నేడు ఫిబ్రవరి 26న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అంచనాలను రీచ్ అయ్యిందా లేదా.? అన్నది ఇప్పుడు చూద్దాం.

కథ & కథనం : విద్యా విధాన్ అనే పేరున్న విద్యా సంస్థలో అక్షర (నందిత శ్వేత) ఉపాధ్యాయినిగా చేరుతుంది. అదే విద్యాసంస్థలో బోర్డు ఆఫ్ డైరెక్టర్ గా శ్రీతేజ ఉద్యోగం చేస్తుంటాడు. ఈ క్రమంలో శ్రీతేజ అక్షర వెంట ప్రేమ పేరుతో పడుతుంటారు. కాగా వేధింపులకు తాళలేక అక్షర శ్రీతేజ ను కాల్చి చంపుతుంది. అబితే కాకుండా ఓ పోలీస్ ఆఫీసర్ కు ను కూడా చంపుతుంది. అంతే కాకుండా అక్షర వెంట ఆమె నివాసం ఉండే కాలనీలో వాల్తేర్ బాయ్స్ గా చలామణి అవుతున్న మధు సుందర్, శంకర్, సత్య కూడా ప్రేమ పేరుతో అక్షర వెంట పడుతుంటారు. అక్షర మాత్రం విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని పోరాటం చేస్తూ ఉంటుంది..అంతే కాకుండా అక్షర చివరికి తన వెంట పడిన నలుగురికి షాక్ ఇస్తుంది. కాగా అక్షర ఏవిధంగా షాక్ ఇచ్చింది.. విద్యావ్యవస్థ లో మార్పులు తీసుకురాగలిగిందా లేదా అన్నదే ఈ సినిమా కథ.

విశ్లేషణ : విద్యావ్యవస్థ లో జరుగుతున్న అక్రమాలు అంటూ ఒక గొప్ప కాన్సెప్ట్ తో వచ్చాడు దర్శకుడు చిన్ని కృష్ణ. కానీ సినిమాలో ఫస్ట్ హాఫ్ అనవసరపు కామెడీ సీన్లతో మెయిన్ కాన్సెప్ట్ ను పక్కన పెట్టేసి సోది కామెడీతో నడిపించాడు. ఇంట్రవెల్ కు ముందు ఉండే ట్విస్ట్ తో సినిమా సెకండ్ హాఫ్ ఎంతో బాగుంటుందని సగటు ప్రేక్షకుడు భావిస్తాడు. కానీ సెకండ్ హాల్ఫ్ లో కూడా నాసిరకం కామెడీ చొప్పించడంతో కథ తేలిపోతుంది. ఇక ఫస్ట్ హాఫ్ లో కామెడీని నమ్ముకున్న దర్శకుడు సెకండ్ హాఫ్ కు వచ్చేసరికి సమయం మించిపోయిందని అనిపించింది. అంతే కాకుండా సెకండ్ హాఫ్ లోనూ నాసిరకం కామెడీతో ఇన్వెస్టిగేషన్ సన్నివేశాల పై ఆశక్తినంతగ్గిపోతుంది. చివరి అరగంట మాత్రం సినిమాకు కీలకంగా మారిందని చెప్పవచ్చు. అక్షర బాల్యంలో ఎదురుకున్న పరిస్థితితులు భావోద్వేగాలతో కూడుకుని ఉంటాయి. హర్షవర్ధన్ ఎపిసోడ్ బాగుంటుంది. విద్యా వ్యవస్థ లో ఉన్న లోపాల గురించి సగటు ప్రేక్షకుడిని ఆలోచింపజేసేలా చేస్తుంది. మొత్తానికి దర్శకుడు ఎంచుకున్న పాయింట్ ను ప్రెజెంట్ చేయడంలో తడపడ్డట్టు అనిపించింది.