ఎన్నికలకు సిద్దమైన హీరో నాని

ఎన్నికలకు సిద్దమైన హీరో నాని

హీరో నాని ఎన్నికలకు సిద్దమవ్వడం ఏంటి అని అనుకుంటున్నారా..? ఈ ఎన్నికలు నిజ జీవితంలో కడులేని వెండితెర ఎన్నికలు. ప్రస్తుతం నాని దసరా అనే మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కిస్తుండగా.. నాని కి జోడిగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. కాగా ప్రస్తుతం ఎన్నికలకు సంబదించిన సన్నివేశాలను మేకర్స్ షూట్ చేస్తున్నారు.

సింగరేణి మైన్స్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని తెలిసిందే. ఆ మైక్స్ లో రెండు గ్రూప్ ల మధ్య కార్మిక సంఘం యొక్క ఎన్నికలు జరుగుతాయట. అందుకు సంబంధించిన షూటింగ్ ఇప్పుడు జరుగుతుందని తెలుస్తోంది. కాగా ఈ మూవీ కోసం నాని చాలా కాలంగా గడ్డం మరియు జుట్టు పెంచుకుని ఉన్నాడు. ఆ గడ్డం మరియు జుట్టు లో ఆయన్ను చూస్తూ ఉంటే అభిమానులకు దసరా ఎలా ఉంటుందా అనే ఆసక్తి కలుగుతుందట. తాజాగా నాని నిర్మించిన హిట్ 2 సూపర్ హిట్ కావడం తో..దసరా తో మరో హిట్ నాని కొట్టబోతాడని అభిమానులు నమ్ముతున్నారు.

follow us