నాని శ్యామ్ సింగరాయ్ ఫస్ట్ లుక్..హత్తుకున్న ఆ భామ ఎవరు.?

  • Written By: Last Updated:
నాని శ్యామ్ సింగరాయ్ ఫస్ట్ లుక్..హత్తుకున్న ఆ భామ ఎవరు.?

నాచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. నాని నటించిన చివరి సినిమా “వి” ఓటీటీ లో విడుదలై నిరాశ పరచగా నాని ఇప్పుడు డిఫరెంట్ సినిమా లతో ముందుకు వస్తున్నారు. వాటిలో ఒకటి శ్యామ్ సింగరాయ్. అయితే ఈరోజు నాని పుట్టినరోజుంసందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. నాని తన సోషల్ మీడియా ద్వారా ఈ పోస్టర్ ను విడుదల చేసి..పేరు శ్యామ్..పూర్తి పేరు…అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ సందర్భంగా నాని విడుదల చేసిన ఫస్ట్ లుక్ ఎంతగానో ఆకట్టుకుంటోంది.

ఈ పోస్టర్ లో నాని చెబులో చేతులు పెట్టుకుని నిల్చోగా…వెనకనుండి హీరోయిన్ కౌగిలించుకుంది. అయితే వెనక నుండి కౌగలించుకున్న హీరోయిన్ ఎవరన్నది నాని ఫ్యాన్స్ కి ప్రశ్నగా మరింది. ఇక ఈ ఫస్ట్ లుక్ తో సినిమాపై అంచనాలు మరిన్ని పెరిగాయి. ఈ సినిమాను కలకత్తా బ్యాగ్డ్రాప్ లో తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. చిత్రంలో నాని సరసన రౌడీ బేబీ సాయి పల్లవి తో పాటు..ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి నటిస్తున్నారు. ఈ సినిమాకి రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ ఆకట్టుకునేలా ఉండటం తో సినిమా విడుదల కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.

follow us