ఆస్కార్ బెస్ట్ సాంగ్ నామినేషన్స్ బరిలో నాటు నాటు సాంగ్

దర్శక ధీరుడు రాజమౌళి అంటే కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా తెలుసు. బాహుబలి సినిమా తో తెలుగు సినిమా స్థాయిని పెంచిన రాజమౌళి..ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ తో మరో పాన్ హిట్ కొట్టి వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం ఈ మూవీ ఆస్కార్ బరిలో నిలువబోతుంది. న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్, హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఫిలిం అవార్డ్స్ గెలుచుకున్న ‘ఆర్ఆర్ఆర్’.. ఈ మూవీలోని మాస్ ట్రాక్ ‘నాటు నాటు’ బెస్ట్ సాంగ్ ఆస్కార్ నామినేషన్స్ బరిలో నిలిచింది.
ఎంఎం కీరవాణి కంపోజ్ చేసిన ఈ‘నాటు నాటు’ బెస్ట్ సాంగ్ విభాగంలో షార్ట్‌లిస్ట్ చేయబడింది. ఈ కేటగిరీకి 81 పాటలు అర్హత సాధించగా.. వాటిలో 15 పాటలు షార్ట్‌లిస్ట్‌కు ఎంపిక చేయబడ్డాయి. నామినీలను నిర్ణయించడానికి మ్యూజిక్ బ్రాంచ్ సభ్యులు ఓటు వేస్తారు. మొత్తం 23 పోటీ విభాగాల్లో నామినేషన్లను 2023 జనవరి 24న ప్రకటిస్తారు. అలాగే మరో భారతీయ సినిమా ‘ది లాస్ట్ ఫిల్మ్ షో’ (చెల్లో షో) బెస్ట్ ఇంటర్‌నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో చోటు సంపాదించింది. వీఎఫ్ఎక్స్, సౌండ్ డిజైనింగ్ విభాగాల్లో కూడా RRR షార్ట్‌లిస్ట్‌కు ఎంపికయ్యే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరిగింది. అయితే మన దేశానికి చెందిన ఏ సినిమాకు ఇందులో చాన్స్ దక్కలేదు. కాగా, ఆస్కార్‌కు పోటీపడుతున్న మొత్తం 81 ట్యూన్స్ నుంచి 15 పాటలను షార్ట్ లిస్ట్ చేశారు. వాటిలో నాటు నాటుతోపాటు అవతార్-2లోని నథింగ్ ఈ లాస్ట్, బ్లాక్ పాంథర్‌లోని లిఫ్ట్ మీ అప్, టాప్ గన్ సినిమాలోని హోల్డ్ మై హాండ్ వంటి పాటలు ఉన్నాయి.