నవీన్ పొలిశెట్టి కాస్త సిద్దు పొలిశెట్టి అయ్యాడు

నవీన్ పొలిశెట్టి కాస్త సిద్దు పొలిశెట్టి అయ్యాడు

నవీన్ పొలిశెట్టి పరిచయం చేయాల్సిన అవసరం లేని హీరో. జాతి రత్నాలు మూవీ తో యూత్ లో ఫుల్ క్రేజ్ సొంతం చేసుకున్న నవీన్..ఆ తర్వాత టాప్ హీరోయిన్ అనుష్క తో ఓ సినిమా చేయబోతున్నట్లు తెలిపి ఆశ్చర్య పరిచాడు. ఈ మూవీ షూటింగ్ కూడా మొదలై చాల రోజులే అవుతుంది. కాకపోతే కాస్త నెమ్మదిగా జరుగుతుంది. ఇక ఈ మూవీ లో అనుష్క ఒక చెఫ్ గా కనిపించబోతున్నట్లు ఆమె ఫస్ట్ లుక్ లో తెలిపారు మేకర్స్.

తాజాగా నవీన్ పొలిశెట్టి పుట్టిన రోజు సందర్భంగా ఆయన లుక్ ను రివీల్ చేయడం జరిగింది. ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టి సిద్దు పొలిశెట్టిగా కనిపించబోతున్నాడు. స్టాండప్ కమెడియన్ గా సిద్దు ఈ సినిమాలో నటిస్తున్నట్లుగా కూడా పేర్కొన్నారు. విభిన్నమైన కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. యూవీ క్రియేషన్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

follow us