బెదురులంక నుండి డీజే టిల్లు బ్యూటీ ఫస్ట్ లుక్

బెదురులంక నుండి డీజే టిల్లు బ్యూటీ ఫస్ట్ లుక్

డీజే టిల్లు మూవీ తో యూత్ ను కట్టిపడేసిన నేహా శెట్టి..తాజాగా RX100 ఫేమ్ కార్తికేయ తో బెదురులంక 2012 అనే మూవీ చేస్తుంది. ఈ మూవీ తాలూకా ఆమె ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేసారు. లౌక్య ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై కలర్ ఫొటో ఫేమ్ రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మిస్తున్న చిత్రానికి క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్నాడు.

ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే ఏడాది ప్రారంభంలో రిలీజ్ కానుంది. కాగా ఇందులో ఫిమేల్ లీడ్‌గా నటిస్తున్న నేహా శెట్టి పుట్టిన రోజును పురస్కరించుకుని సోమవారం మూవీ నుంచి ఆమె ఫస్ట్ లుక్ విడుదల చేస్తూ విషెస్ తెలియజేశారు మేకర్స్. ఈ పోస్టర్ లో నేహా పింక్ కలర్ శారీలో ట్రెడిషనల్‌గా కనిపిస్తోంది. కానీ సినిమాలో ఆమె పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉంటుందని యూనిట్ చెపుతున్నారు. ఇదే క్రమంలోనే ఆమెను అందం, అభినయం కలబోతగా పేర్కొన్నాడు దర్శకుడు క్లాక్స్. ఈ చిత్రంలో శివ క్యారెక్టర్ చేస్తున్న కార్తికేయ వైఫ్ చిత్ర పాత్రలో నేహా నటిస్తున్నట్లుగా తెలిపారు.

ఇక ఈ చిత్రంలో ప్రముఖ నటుడు అజయ్ ఘోష్, కమెడియన్ సత్య, శ్రీకాంత్ అయ్యంగార్, గోపరాజు రమణ, ఎల్‌బీ శ్రీరామ్, ఆటో రాంప్రసాద్, రాజ్ కుమార్ కాశిరెడ్డి, సురభి ప్రభావతి, కిట్టయ్య, అనితా నాథ్, దివ్య నార్ని తదితరులు నటిస్తుండగా , మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు.

Tags

follow us