నేహా శెట్టి హాట్ పోజ్..

నేహా శెట్టి హాట్ పోజ్..

డీజే టిల్లు మూవీతో యూత్ ను ఫిదా చేసిన మంగళూరు భామ నేహా శెట్టి..సోషల్ మీడియా లో రెచ్చిపోతుంది. వెండితెర పైనే కాదు సోషల్ మీడియా లోను తగ్గిదేలే అంటుంది. వాస్తవానికి ఈ భామ కన్నడ సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమైంది. కానీ ఆ సినిమాతో పెద్దగా గుర్తింపు దక్కించుకోలేదు. ఇరాక్ తెలుగు లో పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కిన మెహబూబా సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. ఈ సినిమా ప్లాప్ కావడం తో అమ్మడిని ఎవరు పట్టించుకోలేదు.

తర్వాత సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన గల్లీ రౌడీ అనే సినిమాలో కూడా ఆమె హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా కూడా ఆమెకు పెద్దగా పేరు తీసుకు రాలేదు. ఇక అఖిల్ హీరోగా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో మేఘ అనే ఒక చిన్న పాత్రలో పెళ్లి చూపులకు వచ్చిన అమ్మాయిలా కనిపించింది. ఈ సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే 2022లో రిలీజ్ అయిన డీజే టిల్లు సినిమా ఆమె కెరీర్ ని ఒక్కసారిగా మార్చేసింది. ఆ సినిమా లో అందాల ఆరబోత చేయడం..యూత్ ను బాగా ఆకట్టుకుంది. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఒక్కసారిగా స్టార్ స్టేటస్ అందుకుంది. అలా అని ఆమెకు వరుస అవకాశాలు వస్తున్నా సరే వేటినీ ఒప్పుకోకుండా తనకు బాగా కలిసి వస్తుంది అనుకున్న పాత్రలకే ఓకే చెపుతుంది. తాజాగా సోషల్ మీడియా లో హాట్ ఫొటోస్ షేర్ చేసి అబ్బా అనిపించింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి.

follow us