నెల్లూరు జిల్లా : టీడీపీ ఎమ్మెల్సీకి షాక్…వెలేసిన గ్రామస్థులు ?

  • Written By: Last Updated:
నెల్లూరు జిల్లా : టీడీపీ ఎమ్మెల్సీకి షాక్…వెలేసిన గ్రామస్థులు ?

నెల్లూరు జిల్లా అట్లూరు మండలం ఇసుకపల్లిలో శివాలయం పునః ప్రతిష్ట వివాదంగా మారింది. ఇసుకుపల్లి ఎంఎల్‌సి బీద రవిచంద్ర యాదవ్ స్వగ్రామం కావటం విశేషం. ఇక్కడ ఆలయ పునః ప్రతిష్ట కార్యక్రమాలను‌ అయన దగ్గరుండి చూసుకుంటున్నారు. అయితే ప్రతిష్ట సందర్బంగా శివుడికి అభిషేకం కోసం సముద్రం నుంచి నీటిని తీసుకువస్తున్నారు. కొంతమంది మత్స్యకారులు తాగి మద్యం బాటిల్స్ సముద్రం నుంచి వచ్చే దారిలో వేసినట్లు తెలుసుకున్న బీద రవిచంద్ర అగ్ర హం వ్యక్తం చేశారు. దీంతో మత్స్యకార కుటుంబంలోని ఓ వర్గం రవిచంద్రతో మాట్లాడితే పదివేలు జరిమాన విధిస్తున్నట్లు తీర్మానం చేసింది. అయితే ఈ విషయం రెండు రోజుల్లో సర్దుకుంటుందని అంటున్నారు ఎంఎల్‌సి రవిచంద్ర యాదవ్.

follow us