సమంత లుక్ ఫై నెటిజన్స్ కామెంట్స్

సమంత లుక్ ఫై నెటిజన్స్ కామెంట్స్

మయోసైటిస్ బారినపడిన తర్వాత ఫస్ట్ టైం సమంత మీడియా ముందుకు వచ్చింది. దీంతో అన్ని మీడియా చానెల్స్ వారు ఆమెను కవర్ చేసేందుకు పోటీ పడ్డారు. అయితే సమంత గ్లామర్ మునపటిమాదిరిలా లేదని నెటిజన్లు అంటున్నారు. తెలుగు , తమిళ్ భాషల్లో పలు సినిమాలు చేసి క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న సమంత..ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన ఖుషి మూవీ చేస్తుంది. ఇటీవల మయోసైటిస్ అనే ప్రాణాంతకమైన వ్యాధి బారినపడి చికిత్స తీసుకుంటుంది.

ప్రస్తుతం కోలుకుంటున్న సమంత..తాజాగా ఆమె నటించిన శాకుంతలం మూవీ ప్రెస్ మీట్ లో పాల్గొంది. రుద్రమదేవి ఫేమ్ గుణశేఖర్ డైరెక్ట్ చేస్తూ..నిర్మించిన ఈ మూవీ ఫై అందరిలో భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. ఫిబ్రవరి 17 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో సోమవారం మేకర్స్ ట్రైలర్ విడుదల కార్యక్రమం చేసారు. ఈ కార్యక్రమంలో సమంత కూడా హాజరుకావడం తో అందరి చూపు ఆమెపైనే పడింది. ట్రైలర్ గురించి పెద్దగా జనాలు మాట్లాడుకోవడం లేదు కానీ సామ్ గ్లామర్ ఫై మాత్రం అంత మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.

సమంత ఫేస్ లో మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఆమెకున్న సమస్య కనిపించకుండా ఎక్కువగా మేకప్ తో కవర్ చేశారనిపించిందని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ట్రీట్మెంట్ కారణంగా ఆమె సన్నబడ్డారు. లుక్ అటుంచితే… మునుపటి జోష్ ఆమెలో లేదు. గతంలో సమంత చాలా ఎనర్జిటిక్ గా ఉండేవారు. మీడియా సమావేశాల్లో అడిగిన ప్రశ్నలకు టకటకా సమాధానం చెప్పారు. ఆమె స్పీచ్లో సెటైర్స్, పంచ్లు కూడా ఉండేవి. మునుపటి ఆ సమంత కనిపించ లేదు. ప్రస్తుతం సమంత ను చూస్తే షూట్స్ లో పాల్గొనేందుకు ఇంకా సమయం పడుతుందని అర్ధం అవుతుంది. సమంత ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన ఖుషి మూవీ లో నటిస్తుంది. సామ్ అనారోగ్యం బారినపడడంతో ఈ మూవీ షూటింగ్ కు బ్రేక్ పడింది.

follow us