మళ్లీ ర‌చ్చ‌కెక్కిన సారంగ‌ద‌రియా వివాదం…!

  • Written By: Last Updated:
మళ్లీ ర‌చ్చ‌కెక్కిన సారంగ‌ద‌రియా వివాదం…!

ప్ర‌స్తుతం యూట్యూబ్ ను షేక్ చేస్తున్న పాట సారంగ‌ద‌రియా చిన్న‌పిల్ల‌ల నుండి పెద్ద వాళ్ల‌వాళ్ల వ‌ర‌కూ ఈ జాన‌ప‌దానికి ఫిదా అవుతున్నారు. ఇక ఈ జాన‌ప‌ద గేయం మొద‌ట రేలా రే రేలా లో వినిపించ‌గా ఇప్పుడు ల‌వ్ స్టోరీ సినిమాలో పెట్టారు. అయితే ల‌వ్ స్టోరీ సినిమాలో ఈ సాంగ్ రావ‌డం..పాట‌కు సాయి ప‌ల్ల‌వి స్టెప్పులు వేయ‌డంతోనే తెగ‌పాపులారిటీ వ‌చ్చేసింది. మ‌రోవైపు ఈ పాట‌పై ముందు నుండి వివాదం న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ పాట ను రెలా రే రెలా లో పాడింది తానేన‌ని త‌న‌తో పాడించ‌డ‌కుండా వేరే వాళ్ల‌తో పాడించార‌ని సింగ‌ర్ కోమ‌లి ఆవేద‌న వ్య‌క్తం చేస్తూ ప‌లు ఛానల్స్ లో ఇంట‌ర్యూలు ఇచ్చి చెప్పుకొచ్చింది.

దాంతో ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల కోమ‌లిని పిలిపించి ఆడియో ఫంక్ష‌న్ ఉంటే పాట‌ను త‌న‌తోనే పాడిస్తామ‌ని అంతే కాకుండా కోమ‌లికి పాట‌కు గాను కొంత డ‌బ్బు కూడా ఇస్తామ‌ని చెప్పారు. దాంతో వివాదం స‌ద్దు మ‌నిగింది. ఇక అంతా అయిపోయింది అనుకునేస‌రికి మ‌ళ్లీ ఈ వివాదం ర‌చ్చ‌కెక్కింది. సింగర్ కోమ‌లి తాజాగా ఓ ఇంట‌ర్యూలో మాట్లాడుతూ ల‌వ్ స్టోరీ సినిమాలో త‌న పాట పెట్టుకున్నందుకే అంత‌పెద్ద హిట్ అయ్యింద‌ని చెప్పుకొచ్చింది. దీనికి సంభందించిన ప్రోమో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. దాంతో నెటిజ‌న్లు కోమ‌లిపై ఆగ్రహం వ్య‌క్తం చేస్తున్నారు. మంగ్లీ పాడ‌టం వల్లే ఈ పాట పెద్ద హిట్ అయ్యింద‌ని చెబ‌తున్నారు. అంతే కాకుండా మీ వాయిస్ సాయి ప‌ల్ల‌వి కి సెట్ కాద‌ని కామెంట్స్ పెడుతున్నారు.

follow us

Web Stories