తెలంగాణలో కొత్త ఉద్యోగాలు…

KCR
KCR

ఈరోజు సీఎం కెసిఆర్ ఆధ్వర్యంలో కేబినెట్ మీటింగ్ జరిగింది.  ఈ మీటింగ్ లో అనేక విషయాల గురించి చర్చిస్తున్నట్టు సమాచారం. మార్చి నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి దానిపై ముఖ్యంగా చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది.  బడ్జెట్ తో పాటు సిఏఏ అమలు పై కూడా నిర్ణయం తీసుకోబోతున్నారు.  సిఏఏ నుతెలంగాణలో అమలు చేయకూడదు అని ఇప్పటికే కెసిఆర్ నిర్ణయం తీసుకున్నారు.  దీనికి సంబంధించిన తీర్మానాన్ని వచ్చే సమావేశాల్లో చర్చించే అవకాశం ఉన్నది.  

ఇక వివిధ శాఖల్లో ఉన్న ఉద్యోగాలకు సంబంధించిన విషయాలపై కూడా ఈ కేబినెట్ భేటీలో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.  పురపాలక శాఖలో దాదాపుగా 2వేల ఉద్యోగాల వరకు ఖాళీగా ఉన్నాయి.  వాటిని త్వరలోనే భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతున్నది.  కొత్త రెవిన్యూ చట్టంపై కూడా ఈ కేబినెట్ మీటింగ్ లో చర్చిస్తున్నట్టు సమాచారం.