ఫ్యాన్స్ కు ప్రియురాలిని ప‌రిచయం చేసిన సిద్ధ..!

new poster released from acharya
new poster released from acharya

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ “ఆచార్య” సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చరణ్ మెగాస్టార్ కలిసి ఇదివరకు పలు చిత్రాల్లో కలిసి నటించారు. కానీ ఆచార్య లో మాత్రం దాదాపు ముప్పై నిమిషాలపాటు చరణ్ కనిపించనున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడిగా పూజ హెగ్డే నటిస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల చేసిన రామ్ చరణ్ పోస్టర్ లు అలరించిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఈ చిత్రం నుండి మరో పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

ఈ పోస్టర్ లో రామ్ చరణ్ పూజ హెగ్డే ను హత్తుకుని ఉన్నారు. అంతే కాకుండా సినిమాలో పూజ పేరు నీలాంబరిగా ఈ పోస్టర్ తో ప్రకటించారు. సిద్ధ ప్రేమలో నీలాంబరి అనే క్యాప్షన్ ను ఈ ఫొటోకు జోడించారు. ఇదిలా ఉండగా ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. మని శర్మ స్వరాలు సమకూరుస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లపై నిర్మిస్తున్నారు.