దద్దరిల్లిన మెగా సంగీత్

దద్దరిల్లిన మెగా సంగీత్

మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు నాగబాబు కూతురు వివాహం రాజస్తాన్ ఉదయ్ పూర్ లోని ఉదయ్ విలాస్ లో జరగనున్నది. ఈ వివాహ వేడుకకు అతిరత మహారధులు అందరూ ఇప్పటికే అక్కడి చేరుకొని పెళ్లి సంబరాల్లో మునిగి తేలుతున్నారు. మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ ప్రత్యేక ఆకర్షణ గా నిలుస్తున్నారు. మెగా స్టార్ చిరంజీవి ఫ్యామిలీ స్పెషల్ జెట్ ఫ్లైట్స్ వేసుకొని వెళ్లారు. అలాగే అల్లు ఫ్యామిలీ కూడా స్పెషల్ ఫ్లైట్ తో ఉదయ్ విలాస్ లో వాలిపోయింది.

నిన్న రాత్రి నుండి మెగాఫ్యామిలీ మెగా సంగీత్ వేడుక మొదలైంది. బందువులు, కుటుంబ సభ్యులు మెగా మనవళ్లు, మానవరాళ్ల స్టెప్స్ తో సంగీత్ దద్దరిల్లి పోతుంది. సుష్మిత, శ్రీజ, అల్లు బాబీ లు రామ్ చరణ్ ఏక్ బార్ ఏక్ బార్ పాటకు దూమ్ములేపారు. మెగా అల్లుడు చైతన్య నిహారికా తో రొమాంటిక్ పాటలతో రొమాంటిక్ స్టెప్స్ వేశాడు అందుకు సంబందించిన వీడియో లు ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వుతున్నాయి. మెగా ఫ్యామిలీ మొత్తం నిహారికా పెళ్లి లో సంబరాలు చేసుకుంటున్నాయి. ఈ వేడుకకు పవన్ రాక అనేది కాస్త అనుమానంగానే ఉన్నది. నేరుగా ముహూర్తం టైమ్ కు వస్తాడనే వార్తలు వస్తున్నాయి. పవన్ లేని లోటు సంగీత్ పార్టీ లో స్పష్టంగా కనపడుతుందని సోషల్ మీడియా వేదిక పవర్ స్టార్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

follow us