నిహారిక ఫ్రీ వెడ్డింగ్‌ పార్టీలతో బిజీ బిజీ..

నిహారిక ఫ్రీ వెడ్డింగ్‌ పార్టీలతో బిజీ బిజీ..

మెగా బ్రదర్ నాగబాబు తన కూతురు నిహారికా వివాహం ను చైతన్య తో ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మధ్యనే ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోయింది. ప్రస్తుతం నాగబాబు పెళ్లి పనులపై బిజీగా ఉన్నాడు వీరి వివాహం రాజస్తాన్ లోని ఉదయ్ విలాస్ వేదిక అవ్వుతుంది. అనిల్ అంబానీ కూతురు ఇషా అంబానీ రిసెప్షన్ ను అక్కడే జరిపించారు. ఇప్పుడు నాగబాబు తన కూతురు వివాహం అక్కడ జరిపించడం పెద్ద విశేషమే. నిహారికా చైతన్య ముందే బయలుదేరి ఉదయ్ విలాస్ కు చేరుకున్నారు. అక్కడ ఈ జంట ప్రీ వెడ్డింగ్ షూట్ లతో బిజీగా ఉంది.

ఈ నెల 9న వీరి వివాహం జరగనున్నది. అందుకు సంబందించిన పెళ్లి కార్డు ను నిహారికా సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. మెగా ఫ్యామిలీ కి సంబందించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వుతుంది. ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కు అల్లు అర్జున్ అన్న బన్నీ వాసు, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, కల్యాణ్ దేవ్, అల్లు శిరీష్ , వరుణ్ తేజ్ లు పాల్గొన్నారు. ప్రస్తుతం మెగా కజీన్స్ ప్రీ వెడ్డింగ్ పార్టీలతో ఎంజాయ్ చేస్తున్నారు. నిహారికా,చైతన్య వివాహానికి, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు. మెగా ఫ్యామిలీ నుండి చిరంజీవి, పవన్ కళ్యాణ్ లు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కానున్నారు.

follow us