నాటి అమ్మ చీరను ధరించిన నిహారికా

నాటి అమ్మ చీరను ధరించిన నిహారికా

మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారికా పెళ్లి మరో రెండు రోజుల్లో జరగనున్నది. గుంటూర్ రేంజ్ ఐజీ కుమారుడు వెంకట్ చైతన్య తో రాజస్తాన్ ఉదయ్ పూర్ లోని ఉదయ్ విలాస్ లో అతిరథ మహారథుల సమక్షంలో జరుగుతుంది. గత ఐదు రోజులనుండి నిహారికాను పెళ్లికూతురుగా ముస్తాబు చేస్తున్నారు. రోజుకో ట్రెడిషినల్ డ్రెస్స్ లో ఆమె కనిపిస్తుంది. అందుకు సంబందించిన ఫోటోస్ నూ నిహారికా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వస్తుంది.

నాగబాబు భార్య పద్మ శ్రీ పెళ్లినాటి నిశ్చితార్థం చీరను, నిహారికా నిన్న (ఆదివారం నాడు) కట్టుకొని ముస్తాబు అయ్యారు. ఆమె కట్టుకున్న ఆ చీర ఇప్పటిది కాదు 32 ఏళ్ల క్రితం నాటి చీర అది. అప్పుడు పద్మ శ్రీ ఆ చీరతో దిగిన ఫోటోను.. ఇప్పుడు నిహారికా అదే చీరను ధరించి దిగిన ఫోటోను జత చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ ఫోటో నేటింట్లో వైరల్ అవ్వుతుంది. మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదిక గా నిహారికా కు శుభాకాంక్షలు చెబుతున్నారు.

follow us