సుప్రీమ్ కోర్ట్ కి మరో సారి నిర్భయ కేసు

నిర్భయ కేసు నిందితులు మరో సరి సుప్రీమ్ కోర్ట్ లో రివ్యూ పిటిషన్ వేసుకోనున్నారు రాష్ట్రపతి ని క్షమాపణ కోరే ముందు.. ఒక్కసారి రాష్ట్రపతి తిరస్కరిస్తే ఇంకా వాళ్ళకి శిక్ష తప్పదు, కాబట్టి ఇంకోసారి కోర్ట్ మెట్లు ఎక్క దలచు కున్నారు.
అక్టోబర్ 28 న వాళ్ళకి జైలు అధికారులు నోటీసులు ఇచ్చారు .. వారం రోజులు మాత్రమే నిందుతలకి గడువు ఇచ్చారు క్షమా బిక్ష కోరడానికి. శుక్రవారం నాడు న్యాయవాదులని కలిసిన నలుగురు నిందితులు రాష్ట్రపతి ని కలిసే ముందు చివరి సరి సుప్రీమ్ కోర్ట్ కి వెళ్ళాలి అని నిర్ణయించుకున్నారు.
దీనిలో మరో ముద్దాయి జువెనైల్ కింద జైలు నుంచి బయటకి వచ్చి సాధారణ జీవితం గడుపుతున్నాడు . ఇప్పుడు కారాగారం లో ఉన్న వేళ్ళకి అయినా శిక్ష అమలు అవ్వుతుందో లేదో చూడాలి .