అల్లు అర్జున్ దర్శకుడితో నితిన్ నెక్స్ట్ ..!

టాలీవుడ్ యంగ్ హీరో నీటిని ఈ ఏడాది రంగ్ దే, చెక్ సినిమాలతో వచ్చి ప్రేక్షకులను అలరించారు. అంతే కాకుండా నితిన్ హీరోగా నటిస్తున్న మరో సినిమా మాస్ట్రో ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా అందాదున్ చిత్రానికి రీమేక్ గా వస్తోంది. ఇదిలా ఉండగానే ఇప్పుడు నితిన్ మరో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తుంది. రచయిత నుండి దర్శకుడిగా మారిన వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్ సినిమా చేయబోతున్నాడట.
వంశీ అల్లు అర్జున్ హీరోగా నటించిన నా పేరు సూర్య సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా బన్నీ కెరీర్ లోనే డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఇప్పుడు వంశీ తన నెక్స్ట్ ను నితిన్ తో ప్లాన్ చేశాడట. ఇప్పటికే నితిన్ కు కథ వినిపించగా తెగ నచ్చేసిందట. ఇక అన్నీ అనుకున్నట్టుగా జరిగితే కరోనా తగ్గుముఖం పెట్టగానే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లబోతుంది.
Related News
మాచర్ల నియోజక వర్గం’ స్పెషల్ సాంగ్ నుండి అంజలి లుక్ విడుదల
9 months ago
ఉలగ నాయగన్ కమల్ హాసన్ కు మెగాస్టార్ చిరంజీవి ఇంట సన్మానం
9 months ago
‘విక్రమ్’లో గొప్ప మ్యాజిక్ వుంది: కమల్ హాసన్ ఇంటర్వ్యూ
10 months ago
కమల్ సార్ లో దశావతారాలు కాదు. శతావతారాలు కనపడతాయి – తొలి పాన్ ఇండియా స్టార్ కమల్ సారే- విక్టరీ వెంకటేష్
10 months ago