నితిన్ ను తిన్నావా అంటున్న ప్రగతి ఆంటీ !

టాలీవుడ్ యువ హీరో నితిన్, ప్రగతి ఆంటీ స్నేహ ఫ్రెష్ చికెన్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మారారు. అవును చికెన్ కి ప్రచారం కూడా చేస్తారా అని అనుకుంటున్నారా అవును అండి ఈ వీడియో చూస్తే మీకు ఆ సందేశం కలగక మానదు. సోషల్ మీడియాలో స్నేహ ఫ్రెష్ చికెన్ కు సంబందించిన వీడియో బాగా వైరల్ అవ్వుతుంది.
చాలా సినిమాల్లో తల్లి క్యారక్టర్ పాత్రల్లో నటించిన ప్రగతి ఈ యాడ్ లో నితిన్ కు అమ్మగా మరి “తిన్నావా” అంటూ అడుగుతుంది. ఆ మాటను పాట రూపంలో నితిన్ పాడుతూ … “బంగి జంప్ చేస్తూ మధ్యలో ఉన్న అమ్మ అడిగేది ఒక్కటే క్వచ్చన్ ఏం నాన్న తిన్నావా అంటూ.. కిచన్ కిచన్ లో స్నేహ ఫ్రెష్ చికెన్ అంటూ..ఆఫీసు లో బాస్ తో ఫైటింగ్ చేస్తున్నప్పుడు అమ్మ అడిగేది ఒక్కటే క్వచ్చన్ ఏం బాబు తిన్నావా అని, కిచన్ కిచన్ లో స్నేహ ఫ్రెష్ చికెన్ అంటూ… క్రికెట్ లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అమ్మ అడిగేది ఒక్కటే క్వచ్చన్ కిచన్ కిచన్ లో స్నేహ ఫ్రెష్ చికెన్”. అంటూ ఆద్యంతం నవ్వు తెప్పించే విదంగా చక్కని స్నేహ ఫ్రెష్ చికెన్ యాడ్ ని దర్శకుడు అనిల్ కుమార్ ఉపాధ్యాయుల తెరకెక్కించాడు.
ఇక నితిన్ సినిమా సంగతికి వస్తే రంగ్ దే అనే సినిమాలో నటిస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. నటి ప్రగతి ఈ మధ్య సోషల్ మీడియాలో జిమ్, ఫిట్నెస్ ఎక్సర్ సైజ్ లు చేస్తూ మతి పోగొడుతుంది. ఈ మధ్యకాలంలో ప్రగతి చేసిన వీడియో లు వైరల్ గా మారాయి