పవర్ స్టార్ కు భార్య పాత్రలో నిత్యామీనన్..!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీఎంట్రీ తరవాత వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పిటికే పవన్ వకీల్ సాబ్ సినిమాను పూర్తి చేసి విడుదల చేసారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇదిలా ఉండగానే పవన్ మరో రెండు సినిమాలను పట్టాలెక్కించారు.వాటిలో ఒకటి క్రిష్ దర్శకత్వంలో నటిస్తున్న హరిహరవీరమల్లు కాగా మరో సినిమా మలయాళ సూపర్ హిట్ అయ్యప్పనుమ్ కోషియం రీమేక్. ఈ సినిమాకు సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ తో పాటు రానా కూడా హీరోగా నటిస్తున్నారు. కాగా రానాకు జోడీగా ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే పవన్ కల్యాణ్ హీరోయిన్ ఎవరన్నది మాత్రం ఇప్పటి వరకూ సస్పెన్స్ గానే మిగిలిపోయింది.
కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సిసిమాలో పవన్ కల్యాణ్ కు బోడీగా నటించడానికి నిత్యామీనన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. మొదట రౌడీ బేబీ సాయిపల్లవిని హీరోయిన్ గా అనుకున్నారట కానీ డేట్స్ సమస్య కారణంగా రౌడీ బేబీ ఈ ప్రాజెక్టులో నటించేందుకు నిరాకరించినట్టు తెలుస్తుంది. దాంతో ఆ అవకాశం ఇప్పుడు నిత్యామీనన్ కు దక్కింది. ఇక ఈ సినిమాలో నిత్యామీనన్ పవన్ కల్యాణ్ కు భార్యగా నటించబోతుంది. నిత్యా సన్ ఆఫ్ సత్యమూర్తి తరవాత మళ్లీ పెద్ద సినిమాలో కనిపించలేదు. మళ్లీ ఇన్నేళ్ల తరవాత ఏకంగా పవన్ పక్కనే ఛాన్స్ కొట్టేసింది. ఇక ఈ సినిమాతో నిత్యా మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతుందా లేదా అన్నది చూడాలి.