నితిన్ రంగ్ దే మూవీ రివ్యూ..!

  • Written By: Last Updated:
నితిన్ రంగ్ దే మూవీ రివ్యూ..!

సినిమా :రంగ్ దే
నటీనటులు : నితిన్‌, కిర్తి సురేశ్‌, నరేశ్‌, వెన్నెల కిశోర్‌, కౌసల్య, బ్రహ్మజీ తదితరులు
నిర్మాణ సంస్థ : సితారా ఎంటర్‌టైన్‌మెంట్
దర్శకత్వం : వెంకీ అట్లూరి
సంగీతం : వీ శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ : పీసీ శ్రీరాం
ఎడిటింగ్ : నవీన్‌ నూలీ

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ మహానటి కీర్తి సురేష్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా రంగ్ దే. ఈ సినిమాను తొలి ప్రేమ చిత్రాన్ని తెరకెక్కించిన వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. ఇక ఈ చిత్త ట్రైలర్ మరియు పాటలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. అంతే కాకుండా నితిన్ హీరోగా వచ్చిన చెక్ సినిమా బోల్తా పడటం తో ఈ సినిమాకు ప్రమోషన్స్ ను కూడా భారీగానే చేసారు. మరి ఎన్నో అంచనాల మధ్య ఈరోజు విడుదలైన రంగ్ దే ఆ అంచనాలను రీచ్ అయ్యిందా..? లేదా అన్నది ఇప్పుడు చూద్దాం.

కథ : అర్జున్ (నితిన్‌), అను (కీర్తి సురేష్) పక్క ఇళ్లలోనే నివాసం ఉంటారు. అయితే అర్జున్ అల్లరిగా పెరిగి చ‌దువులో వెనకబడతాడు. కానీ అను మాత్రం క్లాస్ లో ఫస్ట్ వస్తూ ఉంటుంది. దాంతో అర్జున్ తండ్రి (న‌రేశ్) ఎప్పుడూ అనుతో పోలుస్తూ అర్జున్ ను తిడుతుంటాడు. తండ్రి తిట్టాడాని అనునే కారణమని అర్జున్…అను పై ద్వేషం పెంచుకుంటాడు. స్కూల్ ఏజ్ నుండి బీటెక్ వ‌ర‌కూ ఇద్ద‌రికీ టామ్ అండ జెర్రి వార్ న‌డుస్తూనే ఉంటుంది. వ‌య‌స్సు పెరిగేకొద్ది ఇద్ద‌రి మ‌ధ్య ద్వేషం కూడా పెరుగుతూనే ఉంటుంది. అలా ఒక‌రంటే ఒక‌రికి అస్స‌లు ప‌డ‌ని ఈ జంట అనుకోని ప‌రిస్థితుల్లో పెళ్లి చేసుకోవాల్సి వ‌స్తుంది. అలా పెళ్లి చేసుకున్న టామ్ అండ్ జెర్రీ పెళ్లి తరవాత ఎలా ఉన్నారు. వీరి సంసారం ఎలా సాగింది. అస‌లు క‌లిసి ఉన్నారా..? అన్నదే అసలు కథ.

విశ్లేషణ : పక్కపక్కన ఉండే రెండు కుటుంబాల్లో ఒకరి పిల్లలు బాగా చదివితే మరొకరి పిల్లలకు చివాట్లు తప్పవు. భాగా చదివే వాళ్ళతో పోలుస్తూ తమ ఇంట్లో వాళ్లను తిడుతుంటారు. వెంకీ అదే పాయింట్ తీసుకుని ఈ సినిమా కథను రాసుకున్నారు. అయితే దాన్ని కాస్త ఎమోషనల్ గా చూపించాలని అనుకున్నారు. కానీ వర్కౌట్ అవ్వలేదు. సినిమాలో కొత్త ధనం ఏమీ కనిపించలేదు. అంతే కాకుండా చూస్తున్నప్పుడు కొన్ని సినిమాల్లోని సన్నివేశాలు గుర్తుకు వస్తాయి. అయితే కథ లేకున్నా ఎక్కడా బోర్ కొట్టకుండా తెరకెక్కించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. కథలో లెన్త్ ఎక్కువ అయ్యిందేమో అన్న ఫీలింగ్ వస్తుంది. ఇంకాస్త ఎడిటింగ్ చేసి ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది. ఇంటర్ వెల్ సీన్ వచ్చేసరికి సెకండ్ హాఫ్ ఇంకా ఆసక్తికరంగా ఉంటుందని అనుకుంటాం. కానీ ఆ తరవత ఏమి ఉండదు. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం ప్రాణం పోసిందనే చెప్పాలి. సినిమాలో వచ్చే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది. మొత్తానికి చిస్తే వీకెండ్ లో నితిన్ రంగ్ దే సినిమాకు వెళ్లితో బోర్ మాత్రం కొట్టాడు.

నటీనటుల పర్ఫామెన్స్ : అల్లరిగా తిరిగే అబ్బాయి పాత్రలో నితిన్ జీవించాడు. ఎమోషనల్ సన్నివేశాలు…కామెడీ సన్నివేశాలలో సులువుగా నటించాడు. లవర్ బాయ్ గా స్టైలిష్ లుక్ లో కనిపించి ఆకట్టుకున్నాడు. ఇక పేరుకు తగ్గట్టు మహానటి తన పర్ఫామెన్స్ తో అదరగొట్టింది. అమాయకంగా కనిపిస్తూనే నితిన్ ను ఎడిపించే సన్నివేశాల్లో సులువుగా నటించింది. సినిమాలో నితిన్ కి స్నేహితులుగా నటించిన అభినవ్ గోమతం, కలర్ ఫోటో హీరో సుహాస్ తమ పాత్రలకు న్యాయం చేసారు. తండ్రి పాత్రలో నటించిన నరేష్ తన కామెడీ టైమింగ్ తో నవ్వించాడు. సెకండ్ హాఫ్ లో ఎంట్రీ ఇచ్చిన వెన్నెల కిషోర్ సైతం నవ్వించే ప్రయత్నం చేశారు.

follow us

Related News