విరాట‌ప‌ర్వంలో నివేదా పేతురాజ్‌

Nivetha Pethuraj roped in for Virataparvam
Nivetha Pethuraj roped in for Virataparvam

రానా, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టిస్తోన్న చిత్రం ‘విరాట‌ప‌ర్వం’. ‘నీదీ నాదీ ఒకే క‌థ’ ఫేమ్ వేణు ఊడుగుల డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని డి. సురేష్‌బాబు స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్‌.ఎల్‌.వి. సినిమాస్ ప‌తాకంపై సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.

ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ ముగింపు ద‌శ‌లో ఉంది. హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో చివ‌రి షెడ్యూల్ జ‌రుగుతోంది. ఇప్ప‌టికే ప‌లువురు పేరుపొందిన తార‌లు న‌టిస్తోన్న ఈ చిత్రంలో తాజాగా నివేదా పేతురాజ్ జాయిన్ అయ్యారు. ఆమె ఇందులో ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. లాస్ట్ షెడ్యూల్ షూటింగ్‌లో ఆమె పాల్గొంటున్నారు.

ఒక యూనిక్ కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఇప్ప‌టివ‌ర‌కూ క‌నిపించ‌ని పాత్ర‌ల్లో రానా, సాయిప‌ల్ల‌వి న‌టిస్తున్నారు. మిగ‌తా ముఖ్య పాత్ర‌ల్లో ప్రియ‌మ‌ణి, నందితా దాస్‌, న‌వీన్ చంద్ర‌, జ‌రీనా వ‌హాబ్‌, ఈశ్వ‌రీ రావ్‌, సాయిచంద్ క‌నిపించ‌నున్నారు.