పొలిటికల్ బ్యాక్ డ్రాప్: ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాలో ఆ ముగ్గురు ?

  • Written By: Last Updated:
పొలిటికల్ బ్యాక్ డ్రాప్: ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాలో ఆ ముగ్గురు ?

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్.. రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఆ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కే సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. తారక్, మాటల మాంత్రికుడు కాంబినేషన్‌లో తెరకెక్కే ఈ చిత్రాన్ని కళ్యాణ్ రామ్, చినబాబు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘అయిననూ పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్ పరిశీలిస్తోంది చిత్రబృందం. దేశం ఎదుర్కొంటున్న సమకాలీన రాజకీయ అంశాల నేపథ్యంలో త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన కీర్తి సురేష్ దాదాపు ఖరారైంది. ఈ సినిమాలో మరో హీరోయిన్ కు అవకాశం ఉందట. మరో హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌ను తీసుకుంటున్నారని టాక్. పొలిటికల్ నేపథ్యంగా ఈ సినిమా ఉండటంతో సంజయ్ దత్ రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించనున్నారని అంటున్నారు. ఇక ఉపేంద్ర, జయరామ్ పాత్రలు కూడా సినిమాకు చాలా కీలకం అని చెబుతున్నారు. త్రివిక్రమ్ రాసుకున్న కథకు ఈ ముగ్గురిని అయితే బాగా సెట్ అవుతుందని అంచనా వేస్తున్నారట.

follow us