నితిన్ సినిమాకు తారక్ సపోర్ట్.!

ntr Best wishes to nithiin and the whole chek team
ntr Best wishes to nithiin and the whole chek team

వైవిధ్యభరితమైన సినిమాలు తియ్యడంలో చంద్రశేఖర్ యేలేటి సిద్ధహస్తుడు. నిజ జీవితల్లో నుండే ఆయన కథలు పురుడుపోసుకుంటాయి. ఇక ఆయన ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ తో “చెక్” సినిమాను తెరకెక్కించాడు. ఓ తెలివైన కుర్రాడు తనకు జరిగిన అన్యాయాన్ని ఎలా ఎదిరించడన్న లైన్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సినిమాలో ప్రియా ప్రకాష్ వారియర్, రకుక్ ప్రీత్ సింగ్ లు లు హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది.

రేపు 26వ తేదీన సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా వుంది. ఇక తాజాగా ఎన్టీఆర్ ఈ సినిమా పై ఓ ట్వీట్ చేశారు. తాను చంద్ర శేఖర్ యేలేటి సినిమాలకు అభిమానినని తారక్ పేర్కొన్నారు. ఆయన సినిమాల్లో థీమ్, కథ చెప్పే విధానం బాగుంటుందని పేర్కొన్నారు. ఈ సంధర్బంగా హీరో నితిన్ కు..దర్శకుడు చంద్ర శేఖర్ యేలేటి కి అల్ ది బెస్ట్ చెప్పారు.