ఎన్టీఆర్ బర్త్ డే కి డబుల్ కాదు…ట్రిపుల్ ధమాకా.. ?

ntr birth day treats for his fans
ntr birth day treats for his fans

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కరోనా పాజిటివ్ రావడంతో హోమ్ ఐసోలేషన్ లో చికిత్స తీసుకుంటున్నారు. తాను కోలుకుంటున్నానని ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉందని ఎన్టీఆర్ ఇటీవల వెల్లడించారు. అంతే కాకుండా అభిమానులు ఎన్టీఆర్ త్వరగా కోవాలంటూ పూజలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా మే20న ఎన్టీఆర్ బర్త్ డే ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఎన్టీఆర్ బర్త్ డే కోసం ఆయన సినిమాల నుండి ఫ్యాన్స్ కు ట్రీట్ ఇవ్వడానికి మేకర్స్ రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది.

ఆర్ఆర్ఆర్ నుండి మే20న ఓ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేయాలని చూస్తున్నట్టు కూడా టాక్. అంతే కాకుండా ఎన్టీఆర్ 30 నుండి ఓ స్పెషల్ సర్ప్రైజ్ ను ప్లాన్ చేశారట. ఇవి ఇలా ఉండగానే ఎన్టీఆర్ 31 పై మైత్రీమూవీమేకర్స్ కూడా సర్ప్రైజ్ ఇచ్చే అవకాశం ఉందట. అది కూడా ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా అప్డేట్ అయ్యి ఉంటుందని టాక్ వినిపిస్తుంది. చూడాలి మరి ఎన్టీఆర్ బర్త్ డే కు ఎలాంటి ట్రీట్ ఉంటుందో.