ఎన్టీఆర్ తో బుచ్చి సినిమా ఉన్న‌ట్టా…లేన‌ట్టా..?

  • Written By: Last Updated:
ఎన్టీఆర్ తో బుచ్చి సినిమా ఉన్న‌ట్టా…లేన‌ట్టా..?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తాజాగా ఇచ్చిన ఓ ఇంట‌ర్యూతో ఎన్నో ఆసక్తిక‌ర‌ విష‌యాలు భ‌య‌ట‌పెట్టారు. ప్ర‌స్తుతం చేస్తున్న సినిమాల గురించి త‌ర‌వాత చేయ‌బోయే సినిమాల గురించి కూడా వివ‌రాలు వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం తాను ఆర్ఆర్ఆర్ సినిమాలో న‌టిస్తున్నాని..సినిమాలో భారీ యాక్ష‌న్ స‌న్నివేశాలుంటాయ‌ని అన్నారు. అంతే కాకుండా ఈ సినిమా త‌ర‌వాత కొరటాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా ఉండ‌బోతుంద‌ని ఎన్టీఆర్ స్ప‌ష్టం చేశారు. ప్ర‌స్తుం ఈ సినిమా స్క్రిప్ట్ వ‌ర్క జ‌రుగుతుంద‌ని ఎన్టీఆర్ అన్నారు. అయితే ఎప్ప‌టి నుండో ఎన్టీఆర్ మ‌రియు ఉప్పెన ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు కాంబినేష‌న్ లో ఓ సినిమా ఉండ‌బోతుంద‌ని ఫిల్మ్ న‌గ‌ర్ లో టాక్ వినిపిస్తోంది.

అంతే కాకుండా ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఉండ‌బోతుంద‌ని..సినిమాకు మైత్రీమూవీమేక‌ర్స్ బ్యాన‌ర్ లో రాబోతుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. అంతే కాకుండా ఎన్టీఆర్ కూడా బుచ్చిబాబు స్క్రిప్ట్ కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని టాక్ వినిపించింది. అయితే ఎన్టీఆర్ ను ఇంట‌ర్యూలో మీ త‌దుప‌రి సినిమాలు ఏంట‌ని అడిగితే ప్ర‌శాంత్ నీల్ తో ఓ సినిమా ఉంటుంద‌ని చెప్పారు త‌ప్ప బుచ్చి సినిమా గురించి మాత్రం మాట్లాడ‌లేదు. దాంతో ఈ సినిమా లేద‌నే క్లారిటీ వ‌చ్చేసింది.

follow us