ఫ్యామిలీతో కలిసి ఎన్టీఆర్ ఫారిన్ ట్రిప్..

ఫ్యామిలీతో కలిసి ఎన్టీఆర్ ఫారిన్ ట్రిప్..

జూ. ఎన్టీఆర్ ఫ్యామిలీ తో కలిసి ఫారిన్ ట్రిప్ కు వెళ్లారు. నెల రోజుల పాటు ఎన్టీఆర్ అక్కడే గడపనున్నారు. ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా హిట్ అందుకున్న ఎన్టీఆర్..ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో ఓ మూవీ చేయనున్నాడు. ఈ మూవీ ప్రస్తుతం ప్రీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ తరుణంలో ఎన్టీఆర్ ఫ్యామిలీ తో కలిసి ఫారిన్ ట్రిప్ కు వెళ్లారు. అక్కడి నుండి వచ్చాక కొరటాల శివ మూవీ లో జాయిన్ కానున్నారు.

ఇప్పటిదాకా ‘ఆర్ఆర్ఆర్’ విజయాన్ని ఆస్వాదించిన ఎన్టీఆర్.. తదుపరి చిత్రం కొరటాల శివతో చేయనున్నాడు. నిజానికి ఈ సినిమా ఎప్పుడో ప్రారంభం కావాల్సినప్పటికీ.. ‘ఆచార్య’ డిజాస్టర్ తర్వాత కొరటాల చాలా సమస్యల్లో కూరుకుపోయాడు. పైగా ఇప్పుడు ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. దీంతో కథలో అందుకు తగ్గ మార్పులు చేయాల్సి వచ్చింది. దీంతో ప్రీ-ప్రొడక్షన్ వర్క్ కోసం ఎక్కువ సమయం తీసుకుంటున్నాడు శివ.

follow us