ప్ర‌శాంత్ నీల్ తో ఎన్టీఆర్ ఫిక్స్…త్వ‌ర‌లోనే అఫీషియ‌ల్ అనౌన్స్మెంట్.. !

  • Written By: Last Updated:
ప్ర‌శాంత్ నీల్ తో ఎన్టీఆర్ ఫిక్స్…త్వ‌ర‌లోనే అఫీషియ‌ల్ అనౌన్స్మెంట్.. !

ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా తరవాత కొరటాల శివ కాంబినేషన్ లో మరో సినిమా చేయబోతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం పై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ కొరటాల తరవాత ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో ఓ సినిమా చేయబోతున్నారని గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా ఈ చిత్రంపై క్లారిటీ వచ్చేసింది. ఓ ఇంటర్వ్యూ లో ఎన్టీఆర్ కొరటాల తరవాత ప్రశాంత్ నీల్ తో సినిమా ఉంటుందని కన్ఫామ్ చేశారు. ” ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రంలో నాటిస్తున్నాను.

ఈ సినిమా తరవాత కొరటాల శివ దర్శకత్వం లో ఓ సినిమా చేస్తాను. ప్రస్తుతం ఈ సినిమాపైనా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. మాకు ఒక ఆలోచన ఉంది. ఇక ఇప్పటికే మా ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఇక కొరటాల సినిమా పూర్తయిన తరవాత ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో సినిమా ఉండబోతుంది.” అంటూ ఎన్టీఆర్ పేర్కొన్నారు. దాంతో త్వ‌ర‌లోనే ఈ ప్రాజ‌క్టుపై అఫీషియ‌ల్ అనౌన్స్మెంట్ రాబోతుంద‌ని క్లారిటీ వ‌చ్చేసింది. ఇక ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ప్రభాస్ హీరోగా సలార్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మరో వైపు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్ 2 విడుదలకు సిద్దంగా ఉంది. ఇదిలా ఉండగానే ఎన్టీఆర్ తో సినిమా ఫిక్స్ అయింది.

follow us