కోలుకుంటున్నా..త్వరలోనే మీ ముందుకు వస్తా : ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. కరోనా పాజిటివ్ రావడంతో ఎన్టీఆర్ కుటుంబంతో కలిసి హోం ఐసోలేషన్ లోకి వెళ్లారు. అయితే తాజాగా ఆయన ఈ రోజు అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. శుక్రవారం ఉదయం ఎన్టీఆర్ అభిమానులకు ముస్లీం సోదరులకు ఈద్ శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా నా ఆరోగ్యం గురించి ప్రార్థనలు చేస్తున్నా ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మీ ప్రేమానురాగాలతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. త్వరలోనే పూర్తిగా కోలుకుని మీ ముందుకు వస్తాను. కరోనా నిభందనలు పాటించండి. జాగ్రత్తగా ఉండండి. అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.
ఇదిలా ఉండగా మరో ఆరు రోజుల్లో ఎన్టీఆర్ పుట్టిన రోజు ఉంది. దాంతో అప్పటి వరకూ ఎన్టీఆర్ పూర్తి ఆరోగ్యంతో భయటకు రావాలని ఎన్టీఆర్ అభిమానులు కోరుకుంటున్నారు. ఎన్టీఆర్ ఆరోగ్యం కోసం ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి ఎన్టీఆర్ కు ఫోన్ చేసి అతడి ఆరోగ్యంపై ఆరా తీశారు. ఎన్టీఆర్ హుషారుగా మాట్లాడుతున్నాడని త్వరలోనే కోలుకుంటారని చెప్పారు.