సంపూర్ణేష్ బాబు కు జూ. ఎన్టీఆర్ 25 లక్షల సాయం..

సంపూర్ణేష్ బాబు కు జూ. ఎన్టీఆర్ 25 లక్షల సాయం అందించాడట. సంపూర్ణేష్ బాబు అంటే తెలియని సినీ అభిమాని ఉండడు. హృదయ కాలేయం చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచమైన సంపూ..ఫస్ట్ సినిమాతోనే దర్శక ధీరుడు రాజమౌళిని ఆశ్చర్య పరిచాడు. కేవలం సోషల్ మీడియా తోనే విపరీతమైన ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్నాడు. తొలి సినిమా విడుదల కాకముందే రెండవ సినిమా కొబ్బరిమట్ట ప్రారంభించి ఇండస్ట్రీ లో వైరల్ అయ్యాడు. ఈ రెండు సినిమాలతో బిగ్ బాస్ సీజన్ 01 లో ఛాన్స్ కొట్టేసాడు. హౌస్ లో వెళ్లిన మొదటి మూడు , నాల్గు రోజులు ఆడియన్స్ ను బాగానే నవ్వించాడు. ఆ తర్వాత ఇంటి ఫై బెంగ పెట్టుకున్నాడు. నేను హౌస్ లో ఉండలేను , ఇంటికి వెళ్తా అంటూ సరిగా తిండి తినకుండా బాధకు గురయ్యాడు. కన్ఫెషన్ రూమ్ లోపలకి వెళ్లి నేను బిగ్ బాస్ హౌస్ నుండి వెళ్ళిపోతాను అంటూ ఏడ్చి మధ్యలోనే హౌస్ నుండి బయటకి వచ్చేస్తాడు. ఆలా ఇంటి నుండి సంపూ రావడం పెద్ద సన్షేనల్ గా మారింది. వాస్తవానికి బిగ్ బాస్ అగ్రిమెంట్ ప్రకారం ప్రేక్షకుల ఓట్ల ద్వారా ఎలిమినేట్ అయితే తప్ప సొంతంగా బయటకి వెళ్ళాలి అనుకుంటే మాత్రం పాతిక లక్షల రూపాయిల ఫైన్ కట్టాల్సి ఉంటుంది. కాగ్ సంపూ అప్పుడే చిత్రసీమలో అడుగుపెట్టాడు. అంత డబ్బు కట్టలేని పరిస్థితి. దీనిని గమనించిన జూ. ఎన్టీఆర్ సంపూర్ణేష్ బాబు కోసం కల్పించుకొని..బిగ్ బాస్ యాజమాన్యం తో మాట్లాడి , తన సొంత ఖర్చులతో వాళ్లకి పాతిక లక్షల రూపాయిలు చెల్లించి సంపూర్ణేష్ బాబు కి అండగా నిలబడ్డాడట. ఈ విషయాన్ని ఆ షో లో ఒక కంటెస్టెంట్ గా ఉన్న సమీర్ తెలిపాడు.
ఇక సంపూ పర్సనల్ విషయానికి వస్తే..సంపూర్ణేష్ బాబు అసలు పేరు నరసింహాచారి. వీళ్ళ ఊరు సిద్దిపేట దగ్గర్లోని మిట్టపల్లి. వీరిది పేద విశ్వకర్మ కుటుంబం. తినడానికి సరైన తిండి కూడా ఉండేది కాదు. ఇతనికి ఒక అన్న, ఇద్దరు అక్కలు. ఇతను ఏడో తరగతి చదివేటపుడు తండ్రి మరణించాడు. దాంతో అన్న వెండి బంగారం పనికోసం బయట పనిచేస్తుండేవాడు. కొద్ది రోజుల తర్వాత అన్న కుటుంబ పోషణార్థం అదే ఊర్లో వెండి బంగారు పని చేస్తుండేవాడు. పదో తరగతి పూర్తయిన తర్వాత అన్నకు సహాయంగా ఉండటం కోసం నెమ్మదిగా తను కూడా అదే పని నేర్చుకున్నాడు. అన్న ఇతనికి దగ్గర్లోని సిద్ధిపేటలో ఒక దుకాణం పెట్టించాడు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర వీళ్ళ బంధువులు ఉండేవారు. దీంతో వీళ్ళ కుటుంబము సిటీకి వచ్చినప్పుడల్లా సినిమాలు విపరీతంగా చూసేవారు. సినిమాలు చూసేందుకే ప్రత్యేకంగా వచ్చేవాడు.
చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి ఉండేది. దుకాణం నడుపుతూనే సిద్ధిపేటలో ఉన్న మరో నటుడి దగ్గర నటనలో శిక్షణ కోసం వెళ్ళేవాడు. ఆయన ద్వారా నెమ్మదిగా సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించేవాడు. అలా కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన మహాత్మ అనే సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించాడు. తర్వాత హైదరాబాదులో మరో సంస్థలో నటనలో శిక్షణలో చేరాడు మరిన్ని అవకాశాల కోసం ప్రయత్నాలు చేసేవాడు. వాటిలో భాగంగా స్టీఫెన్ శంకర్ అలియాస్ రాజేష్ అనే దర్శకుడితో పరిచయం ఏర్పడింది. సంపూర్ణేష్ బాబు కథానాయకుడిగా హృదయ కాలేయం అనే సినిమా తీయాలని స్టీఫెన్ శంకర్ ఆలోచన. ఈ సినిమా గుర్తింపు కోసం ఇతను తాను ఒక ప్రవాస భారతీయుడిననీ, డబ్బులు బాగా మిగలబెట్టుకుని వచ్చాననీ జీ న్యూస్ ఛానల్ లో ఒక వార్త కూడా ప్రసారం చేయించాడు. ఇదంతా ఇతనికి సాంఘిక మాధ్యమాల్లో విపరీతమైన ప్రచారం తెచ్చిపెట్టింది. తర్వాత విడుదలైన సినిమా ఓ మోస్తరు విజయాన్ని సాధించి ఇతనికి గుర్తింపు తెచ్చిపెట్టింది.