స్టూడెంట్ లీడ‌ర్ గా ఎన్టీఆర్..!

  • Written By: Last Updated:
స్టూడెంట్ లీడ‌ర్ గా ఎన్టీఆర్..!

ఎన్టీఆర్ కొర‌టాల కాంబినేష‌న్ లో వ‌చ్చిన జ‌న‌తా గ్యారేజ్ సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రానికి విమ‌ర్ష‌కుల ప్ర‌శంస‌లు అందాయి. ఇక ఈ సినిమా త‌ర‌వాత మ‌ళ్లీ తొంద‌ర‌లోనే కొర‌టాల‌తో ఓ సినిమా ఉంటుంద‌ని అనుకున్నారు గానీ అలా జ‌ర‌గ‌లేదు. అయితే ఇటీవ‌ల వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో ఓ సినిమా రాబోతుంద‌ని అఫీషియ‌ల్ అనౌన్స్మెంట్ వ‌చ్చేసింది. ఎన్టీఆర్ 30గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ‌సుధ ఆర్ట్స్ బ్యాన‌ర్ ల‌పై మిక్కిలినేని సుధాక‌ర్ నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండ‌గా తాజాగా ఈ సినిమాపై ఫిల్మ్ న‌గ‌ర్ లో కొన్ని వార్తలు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

ఈ సినిమాలో ఎన్టీఆర్ పొలిటిషియ‌న్ పాత్ర‌లో న‌టించ‌బోతున్నాడ‌ని కొద్దిరోజులుగా గుస‌గుస‌లు వినిపిస్తున్న సంగ‌తి విధిత‌మే. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ ఈ సినిమాలో విద్యార్థి నాయకుడిగా క‌నిపించ‌బోతున్నార‌ని టాక్ వినిపిస్తోంది. స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించే స్టూడెంట్ లీడ‌ర్ గా ఎన్టీఆర్ ఆక‌ట్టుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఇప్ప‌టికే కొర‌టాల మ‌హేశ్ బాబును సీఎం గా చూపించారు. కాబ‌ట్టి ఇప్పుడు స్టూడెంట్ లీడర్ గా చూపించ‌బోతున్నార‌ట‌. అయితే ఇది కేవ‌లం ఫిల్మ్ న‌గ‌ర్ టాక్ మాత్ర‌మే ఇందులో ఎంత‌వ‌ర‌కు నిజం ఉందో తెలియాలంటే అఫిషీయ‌ల్ అనౌన్స్మెంట్ వ‌చ్చేవ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.

follow us