ఎన్టీఆర్ 30 స్క్రిప్ట్ కి కొరటాల మెరుగులు..!

దర్శకుడు కొరటాల శివ ప్రస్తుతం ఆచార్య సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో చిరంజీవి హీరోగా నటిస్తుండగా రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 13న విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది కరోనా విజృంభన నేపథ్యంలో సినిమా షూటింగ్ ను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించి. మరోవైపు చిత్రాన్ని ఆగస్టులో విడుదల చేయబోతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందన్నది తెలియాల్సి ఉంది. ఇక కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఇదిలా ఉండగా ఇప్పటికే కొరటాల శివ తన నెక్ట్స్ ప్రాజక్టును అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో కల్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ ఆచార్య సినిమా కు బ్రేక్ పడటం తో కొరటాల ఎన్టీఆర్ 30 స్క్రిప్ట్ కు మెరుగులు దిద్దుతున్నారట. ప్యాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నందున ముందుగా అనుకున్న ఈ స్క్రిప్ట్ లో కొన్ని మార్పులను చేస్తున్నారట. ఇక ఇప్పటికే ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్ లో జనతాగ్యారేజ్ సినిమా వచ్చింది. ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. దాంతో ఎన్టీఆర్ 30పై కూడా ఎన్టీఆర్ అభిమానులకు ప్రేక్షకులకు భారీ అంచనాలున్నాయి. మరి ఆ అంచనాలను రీచ్ అవుతారా లేదా అన్నది చూడాలి.