అది చెబితే జ‌క్క‌న్న గొడ్డ‌లితో నా వెంట ప‌డతాడు : ఎన్టీఆర్

  • Written By: Last Updated:
అది చెబితే జ‌క్క‌న్న గొడ్డ‌లితో నా వెంట ప‌డతాడు : ఎన్టీఆర్

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం క‌రోనా బారిన ప‌డ‌టంతో హోం ఐసోలేష‌న్ లో చికిత్స తీసుకుంటున్నారు. అయితే తాజాగా ఆయ‌న షోన్ ద్వారా ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్యూలో ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించారు. ఆర్ఆర్ఆర్ , త్రివిక్ర‌మ్ చేయ‌బోయే సినిమాల గురించి ఇంట‌ర్యూలో మాట్లాడారు. ఈ సంధ‌ర్బంగా ఆర్ఆర్ఆర్ గురించి ప్ర‌శ్నించ‌గా చాలా యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో కూడుకుని ఆర్ఆర్ఆర్ ఉంటుంద‌న్నారు. అయితే సినిమాను ఓటీటీలో విడుద‌ల చేసే అవ‌కాశం ఏమైనా ఉందా అని ప్ర‌శ్నించ‌గా ఛాన్సే లేద‌ని చెప్పారు.

ఆర్ఆర్ఆర్ థియోట‌ర్ చూడాల్సిన సినిమానేని జురాసిక్ పార్క్, బాహుబ‌లి లాంటి సినిమాల‌ను థియేట‌ర్ లో చూస్తేనే కిక్ వ‌స్తుంద‌ని అన్నారు. అలానే కూడా అని చెప్పారు. అంతే కాకుండా మీరు ఆర్ఆర్ఆర్ సినిమా గురించి మ‌రిన్ని విషయాలు చెబుతారా అని ప్ర‌శ్నింగా….ఇంత కంటే ఎక్కువ చెప్ప‌లేను..ఈ ఇంట‌ర్యూ చూస్తే రాజ మౌళి గొడ్డ‌లి ప‌ట్టుకుని నా వెంట ప‌డ‌తాడ‌ని అన్నారు. ఇక సినిమాలోని ప్ర‌తి యాక్ష‌న్ స‌న్నివేశం ప్రేక్ష‌కుల‌ను వావ్ అనిపిస్తుంద‌ని చెప్పారు. అంతే కాకుండా ఈ సినిమా కోసం తాను 9 కిలోలు పెరిగాన‌ని ఎన్టీఆర్ అన్నారు. ఇది వ‌ర‌కు 71 కేజీలు ఉండ‌గా సినిమా కోసం బాడీ పెంచాల్సి వ‌చ్చింద‌న్నారు.

follow us