బాలీవుడ్ కు వెల్లుతున్నఎన్‌టి‌ఆర్ ఊసరవెల్లి

బాలీవుడ్ కు వెల్లుతున్నఎన్‌టి‌ఆర్ ఊసరవెల్లి

ఈ మధ్య పలు టాలీవుడ్ సినిమాలు బాలీవుడ్ లో రీమేక్ అవ్వుతున్నాయి. ఎన్‌టి‌ఆర్ నటించినటువంటి ఊసరవెల్లి చిత్రం అక్కడ రీమేక్ చెయ్యడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సురేందర్ రెడ్డి ఆ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇక్కడ ఫ్లాప్ టాక్ ను సంపాదించుకుంది. కానీ ఆ చిత్రం బాలీవుడ్ కి వెల్లుతుండటంతో సర్వత్ర ఉత్కంట నెలకొంది. ఈ మధ్య పలు టాలీవుడ్ చిత్రాలు యూట్యూబ్లో హింది డబ్బింగ్ వెర్షన్ లో రికార్డ్ స్థాయిలో వ్యూస్ ను రాబడుతున్నాయి. అక్కడి ప్రజలనుండి మన హీరోస్ కు మంచి ఆధారణ లభిస్తుంది. ఈ మధ్య మన బెల్లంకొండ సినిమాలు కూడా హింది డబ్బింగ్ వెర్షన్ లో రికార్డ్స్ క్రియేట్ చెయ్యడంతో తెలుగు ఛత్రపతి సినిమాను అక్కడ రీమేక్ చెయ్యడానికి సిద్దం అయిన సంగతి మనకు తెలిసిందే.

ఎన్‌టి‌ఆర్ నటించిన ఊసరవెల్లి చిత్రం, అక్షయ్ కుమార్ కి బాగా నచ్చడంతో బాలీవుడ్ లో రీమేక్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నాడు. ఆ సినిమా హక్కులను, టిప్స్ అనే సంస్థ కొనుగోలు చేసింది. ఈ రీమేక్ చిత్రంలో అక్షయ్ కుమార్ నటిస్తాడా లేక ఏ స్టార్ హీరో అయిన నటిస్తాడా అనే విషయం మరి కొద్ది రోజుల్లోనే తెలియనున్నది. ఆ చిత్రంలో తమన్నా నటించినటువంటి పాత్రను బాలీవుడ్ హీరోయిన్ నటించనున్నది. దక్షిణాది నేటివిటీ కి తగినవిదంగా స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చెయ్యనున్నారు. ఎన్‌టి‌ఆర్ కు ఫ్లాప్ ను ఇచ్చిన ఊసరవెల్లి, అక్షయ్ కు అయిన హిట్ ఇస్తుందో చూడాలి మరి.

follow us