ఆర్ఆర్ఆర్ స‌ర్పైజ్ పోస్ట‌ర్.. బ‌ల్లెం గురిపెట్టిన బ‌ర్త్ డే బాయ్.. !

  • Written By: Last Updated:
ఆర్ఆర్ఆర్ స‌ర్పైజ్ పోస్ట‌ర్.. బ‌ల్లెం గురిపెట్టిన బ‌ర్త్ డే బాయ్.. !

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని ద‌ర్శ‌క‌దీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చ‌ర‌ణ్ కూడా న‌టిస్తున్నారు. చ‌ర‌ణ్ అల్లూరి పాత్ర‌లో న‌టిస్తుండ‌గా ఎన్టీఆర్ కొమురం భీం పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఇక ఈ సినిమాలో చ‌ర‌ణ్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ అలియా భ‌ట్ న‌టిస్తుండ‌గా..ఎన్టీఆర్ ప‌క్క‌న ఒలీవియా మోరిస్ న‌టిస్తుంది. ఇక ఇప్ప‌టికే విడుద‌ల చేసిన ఎన్టీఆర్ మ‌రియు చ‌ర‌ణ్ విడియోలు యూట్యూబ్ ను షేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్ పుట్టినరోజు సంద‌ర్భంగా ఓ పోస్ట‌ర్ ను విడుద‌ల చేసింది చిత్ర యూనిట్ . పోస్ట‌ర్ లో ఎన్టీఆర్ బ‌ల్లెం ప‌ట్టుకుని గురిపెడుతున్నారు. న‌ల్ల‌ని కుర్తాతో పంచెక‌ట్టులో ఎన్టీఆర్ లుక్ అదిరిపోయింది. ఇక ఇప్పుడు ఈ పోస్ట‌ర్ ను సోష‌ల్ మీడియాలో ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు. క‌రోనా విజృంభ‌న కార‌ణంగా పుట్టిన రోజు వేడుక‌ల‌కు ఎన్టీఆర్ దూరంగా ఉండ‌టంతో అభిమానులు కూడా ఇంట్లోనే ఉండి సోష‌ల్ మీడియాలో ర‌చ్చ చేస్తున్నారు. త‌న హీరోకు విషెస్ చెబుతూ పోస్ట‌ర్ ను చూసి మురిసిపోతున్నారు.

follow us