#NTR30 టీజర్ డేట్ అదేనా..?

#NTR30 టీజర్ డేట్ అదేనా..?

ఎన్టీఆర్ – కొరటాల శివ కలయికలో #NTR30 మూవీ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కలయికలో జనతా గ్యారేజ్ మూవీ వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు మరోసారి వీరి కలయికలో సినిమా అనగానే అభిమానుల్లో అంచనాలు తారాస్థాయి లో ఉన్నాయి. ఆచార్య తో ప్లాప్ అందుకున్న శివ..ఎన్టీఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. అందుకే ప్రతిదీ జాగ్రత్త పడుతున్నాడు.

ఇక సంక్రాంతి రోజున పూజా కార్యక్రమాలు చేయబోతున్నట్లు తెలుస్తుంది. అదే రోజు ఈ మూవీ కి సంబంధించిన ఒక స్పెషల్ టీజర్ ని కూడా సిద్ధం చెయ్యబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.ఈ చిత్రం మొత్తం అండర్ వాటర్ నేపథ్యం లో కొనసాగుతుందట..భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటుగా, ఎమోషనల్ మోతాదు కూడా ఎక్కువగా ఉంటుందని సమాచారం.

ఇక ఈ మూవీ కి తమిళ్ డైరెక్టర్ అనిరుద్ మ్యూజిక్ అందిస్తుండగా..శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించబోతున్నట్లు వినికిడి.

follow us