300 కోట్ల స్కామ్ : నటుడు శ్రీనివాస్ వారిపై ఆరోపణలు

300 కోట్ల స్కామ్ : నటుడు శ్రీనివాస్ వారిపై ఆరోపణలు

తెలంగాణ ప్రభుత్వం సినిమా కార్మికుల సొంత ఇంటి నిర్మాణం కోసం 65 ఎకరాల స్థలంను ఇచ్చింది. ఈ స్థలంలో చిత్రపురి కాలనీ నిర్మాణలో అక్రమాలు జరిగాయని దాదాపుగా 300 కోట్లను దోచుకున్నారని . ఈనెల 10 చిత్రపురి హౌసింగ్ సొసైటి లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓ. కళ్యాణ్ తీవ్ర ఆరోపణలు చేశాడు.


నేను గత 35 ఏళ్లు నుండి మా అసోసియేషన్ లో సభ్యత్వం ఉంది . ఫిల్మ్ ఫెడరేషన్ లో పనిచేశాను. 2001 నుండి ఈ అక్రమాలు జరుగుతున్నాయి చిత్రపురి హౌసింగ్ కమిటీలో ఉన్న 11 మంది సభ్యులు సినీ కార్మికుల కోసం ఇచ్చిన సొమ్మును దోచుకుంటున్నారు. ఆ 11 మందిలో తమ్మారెడ్డి భరద్వాజ, పరుచూరి వెంకటేశ్వర రావు, వినోద్ బాల ఇలా కొంత మంది ఉన్నారు.

నేను ఆ విషయంపై నా కమిటీలో ఉన్న సభ్యులతో కలిసి పోరాటం చేస్తున్నాం అన్నారు. తమ్మారెడ్డి భరద్వాజ బయట వాళ్ళను మభ్య పెట్టి వాళ్ళకు ఇక్కడ ఫ్లాట్స్ ఇప్పించాడు. సినిమా వాళ్ళకు ఇల్లు కట్టేందుకు తమ వద్ద డబ్బు లేదని చెప్పి బయటి వాళ్ళతో కుమ్మకై నిర్మాణం చేపట్టాడు. నేను నా టీమ్ సభ్యులు అంతా కలిసి న్యాయం చెయ్యాలి అనుకోని నిర్మాత సి. కళ్యాణ్ ను కలిస్తే ఆయన చేయలేను అని చెప్పి తమ్మారెడ్డి భరద్వాజ కమిటీలో చేరాడు.

25 ఎకరాలు తాకట్టు పెట్టి స్టేట్ బ్యాంక్ నుండి 35 కోట్లు తీసుకున్నారు దానికి వడ్డీ కట్టక పోవడంతో నాన్ ఫార్ఫర్మెంస్ అసెట్ కింద కు వెళ్లింది. అలా ఆ 35 కోట్లను తినేశారు. పాపం వాళ్ళు బ్యాంక్ కు వడ్డీలు కడుతూ అద్దెలు చెలిస్తున్నారు. అందుకు సంబందించిన ఆదారాలు, పాత్రలు నా వద్ద ఉన్నాయి అని శ్రీనివాస్ అన్నారు. ఆ కమిటీలో ఉన్న సభ్యులకు కావలిసింది డబ్బు మాత్రమే అన్నారు. ఇక క్యాషియర్ గా ఉన్న పరుచూరి వెంకటేశ్వర రావు కి ఇవ్వని తెలియకుండా ఉంటాయా.

300 పైగా సినిమాలకు కథలు రాసి, నీతి, న్యాయం అంటూ మాట్లాడుతుంటాడు. ఇప్పుడు అక్కడ ఎలక్షన్స్ వస్తుండటంతో మరలా ఇదే టీమ్ అక్కడ కూర్చొని నీతులు చెబుతుంటారు. ఈసారి వీళ్ళు గెలిస్తే ఇక అక్కడ చిత్రపురి కాలనీ ఉండదని శ్రీనివాస్ అన్నారు. ప్రభుత్వమే 200 కోట్లు ఖర్చు పెట్టి రోడ్లు వేసిందని అన్నారు. దాసరి నారాయణరావు గారు 8 కోట్లు తలసాని శ్రీనివాస్ గారు 6 కోట్లు ఇచ్చాడు.. ఇప్పుడు బ్యాంక్ లో జీరో బ్యాలెన్స్ చూపిస్తున్నారు. ఈ డబ్బులన్నీ ఏమైపోయాయి అని ప్రశ్నించారు.

follow us