ఎన్టీఆర్ తో ఒలీవియా మోరిస్

  • Written By: Last Updated:
ఎన్టీఆర్ తో ఒలీవియా మోరిస్

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ” ఆర్ ఆర్ ఆర్ ” . తెలుగు టాప్ హీరోలు అయినా ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ తో ఈ సినిమా 70 %షూటింగ్ పూర్తి చేసుకుందని ప్రటించారు . ఈ సినిమా లో కొమరం భీం గా తారక్ నటిస్తుండగా, అల్లూరిగా రాంచరణ్ నటిస్తున్నాడు. రాంచరణ్ సరసన అలియా భట్ ను ఎంపిక చేసి చాలా రోజులు అయ్యింది . ఇక ఎన్టీఆర్ కోసం విదేశీ భామ ని తీసుకోవాలని ఎమ్మా రోబెర్ట్స్ ని ఎంచుకున్నారు , కానీ ఆమెకి షూటింగ్ డేట్స్ కుదరకపోవడం తో ఆర్ ఆర్ ఆర్ టీం ఇప్పటివరకు ఎవరిని ప్రకటించలేదు .

అయితే ఎన్టీఆర్ సరసన ఇప్పడు మరో హాలీవుడ్ భామని సెలెక్ట్ చేశారు , ఆమె ఒలీవియా మోరిస్, ఆర్ ఆర్ ఆర్ సినిమాలో ఈమె జెన్నిఫర్ పాత్రతో మన ముందుకు రాబోతుంది . ఈ అప్డేట్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు . ఈ సినిమాని డివివి ఎంటర్టైన్మెంట్ సంస్థ అధినేత అయినా దానయ్య నిర్మిస్తున్నారు . 2020 సమ్మర్ లో ఏ సినిమా రిలీజ్ చేయడానికి రాజమౌళి సన్నాహాలు చేస్తున్నారు. 

Tags

follow us

Web Stories