కూలీకొడుకు ప్రైజ్ మనీని జేబులో వేసుకున్న ఓంకార్ అన్నయ్య..!

బుల్లి తెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న ఓంకార్ ఎన్నో రియాలిటీ షోలతో ప్రేక్షకులను అలరించాడు. ఇక ఓంకార్ మొదట జీతెలుగులో ప్రసారమైన ఆట డ్యాన్స్ షోతో ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్నాడు. అప్పట్లో ఈ డ్యాన్స్ షోకు ఎంతో మంది అభిమానులు కూడా ఉండేవారు. అయితే ఈ షో టీఆర్పీ కోసం ఓంకార్ ఎన్నో ట్రిక్కులు కూడా ఉపయోగించేవారు. కంటెస్టెంట్ లతో అన్నయ్యా అని పిలిపించుకోవడం…వాళ్లను కాళ్లపై పడేలా చేసుకోవడం. గొడవలు క్రియేట్ చేయడం…అది చూసి ప్రేక్షకులు నిజమేనేమో అని రేపు ఏం జురుగతుందా అని ఎదురు చూడటం ఓంకార్ తీసుకువచ్చిన ట్రిక్సే. అయితే ఇప్పుడు చాలా టీవీ షోలు ఓంకార్ నే ఫాలో అవుతుండటం విశేషం.
ఇదిలా ఉండగా షోలో మంచి వాడిలా బిల్డప్ ఇచ్చే ఓంకార్ ఆట ప్రోగ్రాం సీజన్ 6 సమయంలో ఓ కూలీ కొడుకుకు వచ్చిన రూ.1 లక్ష ప్రైజ్ మనీని ఇవ్వకుండా తన జేబులోనే వేసుకున్నాడట. ఈ విషయాన్ని ఆటలో మాస్టర్ గా వచ్చిన సన్ని తాజాగా ఓ ఇంటర్వూలో వెల్లడించాడు. జీతెలుగు నుండి డబ్బులు వచ్చినా వాటిని విన్నర్ కు ఇవ్వకుండా తానే తీసుకున్నాడని సన్నీ చెప్పారు. అంతే కాకుండా విన్నర్ లుగా నిలిచిన ఎవరికీ డబ్బులు ఇచ్చేవాడని సన్నీ సంచలన విషయాలు బయటపెట్టాడు. ఇక ప్రస్తుతం ఓంకార్ డ్యాన్స్ ప్లస్ అనే షో చేస్తున్నారు. ఈ షో కూడా అచ్చం ఆట డ్యాన్స్ షో మాదిరిగానే ఉంటుంది.