తొలి సౌత్ ఇండియన్ హీరోగా విజయ్ దేవరకొండ

  • Written By: Last Updated:
తొలి సౌత్ ఇండియన్ హీరోగా విజయ్ దేవరకొండ

యంగ్ హీరో విజయ్ దేవరకొండ చాలా తక్కువ కాలంలోనే సూపర్ ఫేమ్ ను సంపాదించుకున్నాడు. వరుస విజయాలతో యూత్ లో భీభత్సమైన క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా అర్జున్ రెడ్డి, గీత గోవిందం వంటి సినిమాలు విజయ్ స్టేటస్ ను అమాంతం పెంచేసాయి. బయట తన యూనిక్ బిహేవియర్ తో కూడా విజయ్ దేవరకొండ ఆకట్టుకుంటున్నాడు. ఎప్పుడూ భిన్నమైన యాటిట్యూడ్ ను మైంటైన్ ను చేసే విజయ్ యూత్ కు చేరువయ్యాడు. ఫలితమే సోషల్ మీడియాలో భీభత్సమైన ఫాలోయింగ్.

తాజాగా విజయ్ ఇన్ స్టాగ్రామ్ ఖాతా 10 మిలియన్ ఫాలోవర్స్ కు చేరువైంది. ఈ అరుదైన ఫీట్ ను అందుకున్న తొలి సౌత్ ఇండియన్ హీరోగా విజయ్ దేవరకొండ నిలవడంతోనే అతని క్రేజ్ ఏ రేంజ్ కు చేరుకుందోనన్న విషయం అర్థమవుతోంది. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ చిత్రంలో నటిస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఈ చిత్రం ఐదు భాషల్లో విడుదల కానుంది.

follow us