చింతమనేని పై మళ్ళీ మరో కేసు , చంద్రబాబు పరామర్శ .. !!

దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని నిన్న జైలు నుండి బెయిల్ పై రిలీజ్ అయ్యారు. విడుదల అయినా తరవాత మీడియా తో మాట్లాడుతూ వైస్ జగన్ మీద విమర్శలు చేశారు . ఇంకా వైస్ జగన్ కి జైలు జీవితం తెలియదా ? నన్ను జైల్లో కుళ్ళ పొడిపించారు అని అన్నారు . 67రోజులు జైల్లో ఉంచారని తను ఏ తప్పు చేయలేదని , 18 కేసుల్లో నన్ను అరెస్ట్ చేశారని చెప్పారు .
అయితే చింతమనేని పై మరో కేసు నమోదు అయినది. రిలీజ్ అయ్యాక నిబంధనలకు విరుద్ధంగా ర్యాలీ చేశారని కేసు నమోదు చేశారు పోలీసులు. ఇప్పటికే దళితులను దూషించిన కేసుల్లో ఇరుక్కొనివున్న చింతమనేనిపై మళ్లీ కేసు నమోదు అయింది.
67 రోజులు జైల్లో ఉండి వచ్చిన చింతమనేనిని ఈ రోజు చంద్రబాబు పశ్చిమగోదావరి జిల్లా లో దెందులూరు లో చింతమనేని ఇంటికి వెళ్లి పరామర్శించారు . కుటుంబ సభ్యులకి దైర్యం చెప్పారు, ఇంకా పార్టీ కార్యకర్తలకి నాయకులం అందరం అండగావుంటామని భరోసా ఇచ్చారు .