ఆర్ఆర్ఆర్ నుండి మ‌రో పోస్ట‌ర్..అల్లూరి, భీం క‌ల్లలో ఆనందం..!

one more poster from rrr movie
one more poster from rrr movie

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమా లో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్నారు. సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా…ఎన్టీఆర్ గోండు బెబ్బులి కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్నాడు. అంతే కాకుండా ప్యాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ కు జోడీగా అలియా భట్ నటిస్తుండగా ఎన్టీఆర్ కు జోడీగా ఒలీవియా మోరీస్ నటిస్తోంది. ఇదిలా ఉండగా ఇప్పటికే ఈ సినిమా నుండి చరణ్ ఎన్టీఆర్ వీడియోలు విడుదల చేసిన సంగతి తెలిసిందే.

కాగా తాజాగా ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ చిత్ర యూనిట్ మరో పోస్టర్ ను విడుదల చేసింది. ఈ పోస్టర్ లో ప్రజలంతా సంబురాలు జరుపుకుంటూ ఉండగా ఎన్టీఆర్ చరణ్ లను గాల్లోకి ఎత్తేశారు. దాంతో డిఫరీ ముఖాల్లో ఆనందం కనిపిస్తోంది. ఇక ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. అటు చరణ్ అభిమానులు..ఇటు ఎన్టీఆర్ అభిమానులు పోస్టర్ చూసి పండగ చేసుకుంటున్నారు.