ఉల్లి ఎఫెక్ట్ : కోటీశ్వరుడైన రైతు

ఉల్లి ధర బాగా పెరిగింది.. కేజీ 140 రూపాయల వరకు రైతులే అమ్ముతున్నారు.. కొనే ప్రజల పరిస్థితి ఎలా ఉన్న అమ్మే రైతులలో కొందరు మాత్రం జాక్ పాట్ పట్టారు.. న్యూస్ 18 కధాంశం ప్రకారం ఒక కర్ణాటక కి చెందిన 42 ఏళ్ల మల్లికార్జున అనే రైతు ఒక్కసారిగా ఈ ఉల్లి దెబ్బ కి కోటీశ్వరుడైపోయాడు.. మల్లికార్జున సాగుచేసే 20 ఎకరాలలో 240 టన్నుల ఉల్లి దిగుబడి వచ్చింది.. అంటే అటు ఎటు కోటి డెభై లక్షలు వచ్చాయట.. ఎప్పటి దాక అప్పులలో ఉన్న రైతు ఒక్కసారిగా కోటీశ్వరుడైపోయాడు..
మనం ఇలాంటివి సినిమాలలో లేక పోతే కథలుగా మాత్రమే వింటాం.. కానీ నమ్ముకున్న భూమి తల్లి ఆయనని నిజంగానే కోటేశ్వరుడిని చేసింది.. ఆయన పెట్టిన పెట్టుబడి కొన్ని లక్షలు మాత్రమే.. కానీ వచ్చిన ఆదాయం మాత్రం కోట్ల రూపాయలలో.. అదృష్టం బాగుంది అమ్ముడు పోయాయి.. అదే పోక పోతే ఇంకా అప్పుల లో కి వెళ్లి పోయే వాడిని అంటూ చెప్పుకు వచ్చాడు.. ఉల్లి కన్నీళ్లు తెచ్చిన కానీ నమ్ముకున్న ఈ మల్లికార్జున్ కి మాత్రం ఆ కనీళ్లను ఆనంద బాష్పాలుగా మార్చింది..