గాన గాంధర్వుడికి పద్మవిభూషణ్…!

2021 పద్మా అవార్డులను కేంద్రం ప్రకటించింది. మొత్తం 119 మందిని పద్మా అవార్డులకు ఎంపిక చేసింది. వాటిలో 7 పద్మ భూషణ్, 10 పద్మ విభూషణ్, 102 పద్మ శ్రీ లను కేంద్రం ప్రకటించింది. తెలంగాణ నుంచి ఆర్ట్ విభాగంలో కనక రాజు కు పద్మ శ్రీ పురస్కారం లభించింది. ఏపికి చెందిన వారికి మూడు పద్మ శ్రీ అవార్డులు వచ్చాయి. ఆర్ట్స్ విభాగంలో రామస్వామి అన్న వరపు, నిడుమోలు సుమతి కి అవకాశం దక్కింది. ప్రకాశ రావు అసవాది కి (సాహిత్యం, విద్య) లో పద్మ శ్రీ పురస్కారం లభించింది. అంతే కాకుండా ప్రముఖ సింగర్ చిత్ర కు పద్మభూషణ్ పురస్కారం లభించింది. అవార్డీలలో 10 మంది మహిళలు, 10 ఎన్ ఆర్ఐ, విదేశీలు, ఒక ట్రాన్స్ జెండర్ ఉన్నారు. మరణాంతరం అవార్డులు సొంతం చేసుకున్నవారిలో 16 మంది ఉన్నారు.
ఇక టాలీవుడ్ ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రమణ్యం కు పద్మవిభూషణ్ పురస్కారం లభించింది. ఇక ఎస్పీ బాలసుబ్రమణ్యం కరోనా మహమ్మారి కారణంగా చెన్నై లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంగతి తెలిసిందే. సంగీత ప్రపంచంలో ఎస్పీ తనదైన ముద్రను వేసుకున్నారు. ఎన్నో సినిమాలకు ఆయన పాటలను పాడారు. జాతీయ , అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు. ఇక తాజాగా బాలుకు మరణాంతరం పద్మ విభూషణ్ అవార్డుకు ఎంపిక చేయడం సంతోషించదగ్గ విషయం.