ఉదయం ప్రభాస్ తో సాయంత్రం నాగ చైతన్య తో

గీత గోవిందం దర్శకుడు పరుశురాం చాల గ్యాప్ తీసుకున్నారు.. ఇప్పుడు అయన చాల ఫాస్ట్ గా సినిమా మొదలు పెట్టడానికి చేయవలసిన పనులు అన్ని చేస్తున్నారు.. వాటిలో భాగం గానే ఈ రోజు ఉదయం ప్రభాస్ ని సాయంత్రం అయ్యే సరికి నాగ చైతన్య ని కలిశారు. మహేష్ బాబు కోసం సిద్ధం చేసుకున్న కథ ని ప్రభాస్ కి వినిపిస్తే ఆయన మార్పులు అడిగారు , వాటిని చేసుకొని పరుశురాం ఈ రోజు కథ మళ్ళీ వినిపించారు ప్రభాస్ కి.. అలానే నాగ చైతన్య కోసం తన దగ్గర ముందు నుంచి ఉన్న కథ కి మార్పులు చేర్పులు చేసి వినిపించారు.. నాగ చైతన్య తో సినిమా కచ్చితంగా ఉంటుంది కానీ అది ఎప్పుడు అంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది..