కాంతారా మూవీఫై పరుచూరి కామెంట్స్

కాంతారా మూవీఫై పరుచూరి కామెంట్స్

టాలీవుడ్ స్టార్ రైటర్స్ లలో పరుచూరి బ్రదర్స్ ఒకరు. ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ కు వీరు పనిచేసారు. ప్రస్తుతం డైరెక్టర్లే రైటర్లుగా మారిపోవడం తో వీరి హావ తగ్గింది. తాజాగా పరుచూరి గోపాలకృష్ణ..కాంతారా మూవీ ఫై తన కామెంట్స్ ను తెలియజేసారు. కన్నడ లో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన చిత్రం కాంతారా. కన్నడ లో సూపర్ హిట్ కావడం తో మిగతా భాషల్లో విడుదలై బ్లాక్ బస్టర్ అయ్యింది. కేవలం టాక్ మాత్రమే కాదు బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టించింది. సినీ ప్రముఖులే కాక రాజకీయ ప్రముఖులు సైతం కాంతారా ఫై ప్రశంసలు కురిపించారు.

కర్ణాటక ఆదివాసీల సంప్రదాయం.. సంస్కృతి ఆధారంగా రూపొందించిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుంటుంది. ఈ సినిమా అత్యద్భుతంగా ఉందని.. ఇందులో ఎలాంటి లోపాలు కనిపించలేదని అన్నారు రచయిత పరుచూరి గోపాలకృష్ణ. ఇంతటి అద్భుతమైన సినిమాను తాను థియేటర్లలో చూడలేకపోయానని… అది తన బ్యాడ్ లక్ అన్నారు. ఇటీవల ఈ కాంతార చిత్రాన్ని చూసిన ఆయన.. పరుచూరి పలుకులు వేదికగా కాంతార సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.

ముఖ్యంగా స్క్రీన్ ప్లై. రిషబ్ శెట్టి.. కథ, కథనం అద్భుతంగా తీర్చిదిద్దారు. సినిమా ప్రథమార్థం చూసినప్పుడు జమిందారే విలన్ అని ఎవరు అనుకోరు. అటవీ అధికారే ప్రతినాయకుడు అనే భావన ప్రేక్షకులకు కలుగుతుంది.

కానీ అడవి మీద కన్ను వేసింది జమిందారే అని చూపించి.. సెకండాఫ్ లో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఇచ్చారు. జమిందార్ పాత్రదారిగా అచ్యు్త్ కుమార్ నటన అదిరిపోయింది. ఈ సినిమాలోని ప్రతి ఒక్కరి నటన అద్భుతం. ముఖ్యంగా తల్లిపాత్ర పోషించిన ఆమెను ఏ నటితో పోల్చాలో అర్థం కావడం లేదు. ఆమె సినిమా నటి అంటే ఎవరూ నమ్మరు. అడవిలో ఉండే అమ్మాయి ఈ పాత్ర పోషించారా అనే భావన కలిగేంత సహజంగా సినిమాలో లీనమై పోయారు. ఆమెకు నిజంగా హ్యాట్సాఫ్. క్లైమాక్స్ కూడా అద్భుతంగా ఉంది. నటన, స్క్రీన్ ప్లే, కథ, కథనం ఇలా ఏ విషయంలోనూ లోపాలు కనిపించలేదు. అందుకే ప్రేక్షకులు ఈ సినిమాకు భారీ విజయాన్ని అందించారు ” అంటూ తెలిపారు గోపాలకృష్ణ.

follow us