లిప్ లాక్ తో కొత్త ఏడాదికి స్వాగతం పలికిన ముదురు జంట పవిత్రా నరేష్

  • Written By: Last Updated:
లిప్ లాక్ తో కొత్త ఏడాదికి స్వాగతం పలికిన ముదురు జంట పవిత్రా నరేష్

అనుకున్నదే అయ్యింది.. ఎట్టకేలకు బంధాన్ని బహిర్గతం చేశారు ముదురు జంట. వివాదాలు, విమర్శలు, గొడవలు, కేసులు అంటూ ఈ ఏడాది మొత్తం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన జంట పవిత్రా లోకేష్, నరేష్ జంట. గతంలో వీరు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వచ్చిన వార్తతో మొదలైన ఈ వివాదం చివరికి వీరి పెళ్లి వార్తతో ముగిసింది. అవును.. సీనియర్ నటుడు నరేష్, నటి పవిత్రా లోకేష్ ను నాలుగో వివాహం చేసుకోనున్నాడు. ఈ విషయాన్ని ఈ జంట అధికారికంగా ప్రకటించింది.

కొత్త ఏడాది కొత్త జీవితం మొదలుపెడుతున్నట్లు నరేష్ ట్విట్టర్ వేదికగా ఒక వీడియో ద్వారా అధికారికంగా ప్రకటించాడు. ఈ వీడియోలో నరేష్, పవిత్రా లిప్ లాక్ పెట్టుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ఈ వయస్సులో పెళ్లి అనేదే అతి అంటే.. లిప్ లాక్ పెట్టి మరీ చెప్పడం మరింత అతి అని నెటిజన్లుకామెంట్స్ పెడుతున్నారు. ఇక నరేష్ విషయానికొస్తే.. ఇప్పటికే నరేష్ మూడుసార్లు వివాహం చేసుకున్నాడు. నరేష్ మూడో బార్య రమ్య. తనకు నరేష్ విడాకులు ఇవ్వకుండా నాలుగో పెళ్లి ఎలా చేసుకుంటాడని మీడియా ముందుకు రావడం, పవిత్రా, నరేష్ హోటల్ లో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా ఆమె పట్టుకోవడం గా జరిగాయి. మరి ఇప్పుడు ఈ జంట తమ వివాహాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ సమయంలో రమ్య ఎలా స్పందిస్తుందో చూడాలి.

follow us

Related News