ఖైరతాబాద్ ఆర్టీవో ఆఫీస్‌కు జనసేన అధినేత

సినీ నటుడు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఖైరతాబాద్ ఆర్టీవో ఆఫీస్‌కు వచ్చారు. త్వరలో ఏపీలో బస్సు యాత్ర చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పవన్ వారాహి పేరుతో ప్రత్యేకమైన బస్సు ను రూపొందించారు. దీనికి సంబదించిన రిజిస్ట్రేషన్, తదితర పనుల కోసం ఖైరతాబాద్‌లోని ఆర్టీవో కార్యాలయానికి పవన్ కళ్యాణ్ వచ్చారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్‌కు అధికారులు ఘన స్వాగతం పలికారు.
వారాహి వాహనంతోపాటు మరో 6 వాహనాలు కూడా సిద్దమయ్యాయి. ఆ వాహనాల రిజిస్ట్రేషన్ కోసం స్వయంగా పవన్ కల్యాణ్ ఖైరతాబాద్ ఆర్టీవో ఆఫీస్‌కు వచ్చారు. అధికారులతో మాట్లాడిన తర్వాత జనసేన కోసం ఆరు వాహనాల్లో రిజిస్ట్రేషన్ చేసుకొన్నట్టు సమాచారం. రిజిస్ట్రేషన్ పనులు పూర్తి కాగానే.. అధికారులకు అభివాదం చేసి పవన్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ వారాహి రంగు విషయంలో వైస్సార్సీపీ నేతలు భారీ విమర్శలే చేసినప్పటికీ..రవాణా శాఖా మాత్రం ఎలాంటి అడ్డుకులు చెప్పకుండా రిజిస్ట్రేషన్ పూర్తి చేసారు.