పూనకాలకు పవన్ ఫ్యాన్స్ సిద్ధమవ్వండి

పూనకాలకు పవన్ ఫ్యాన్స్ సిద్ధమవ్వండి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..న్యూ ఇయర్ కు ముందే సంబరాలు చేసుకునే అప్డేట్ వచ్చేసింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓ పక్క వరుస సినిమాలు, మరోపక్క జనసేన పార్టీ కార్యక్రమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న సంగతి తెలిసిందే. సెట్స్ ఫై క్రిష్ డైరెక్షన్లో హరిహర వీరమల్లు మూవీ చేస్తున్నాడు. ఫిబ్రవరి లో ఈ మూవీ షూటింగ్ పూర్తి కానుంది. మొఘల్ కాలానికి చెందిన 17వ శతాబ్దపు బ్యాక్ డ్రాప్‌తో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో మూవీ రిలీజ్ చేయటానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

ఇప్ప‌టికే రిలీజైన హరి హర వీర మల్లు మూవీకి సంబంధించి ఫొటోలు, వీడియో కంటెంట్ సినిమాపై ఉన్న అంచ‌నాల‌ను మ‌రింత పెంచేసింది. ఇక ఇప్పుడు న్యూ ఇయర్ కానుకగా డిసెంబర్ 30 న సినిమా తాలూకా గ్లింప్స్‌ను రిలీజ్ చేయబోతున్నారు. ఈ గ్లింప్స్‌ మాములుగా ఉండదని , అభిమానుల అంచనాలు రెట్టింపు చేసేలా ఈ గ్లింప్స్‌ ఉండబోతుందని చిత్ర యూనిట్ చెపుతున్నారు. వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్ సంద‌ర్భంగా ఏప్రిల్ 28న హ‌రి హ‌ర వీర మ‌ల్లు చిత్రాన్ని విడుద‌ల చేయ‌టానికి నిర్మాత ఎ.ఎం.ర‌త్నం ప్లాన్స్ చేసుకుంటున్నారు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ న‌టించారు. మెయిన్ హీరోయిన్‌గా నిధి అగ‌ర్వాల్ క‌నిపించ‌నుండ‌గా మ‌రో హీరోయిన్‌గా న‌ర్గీస్ ఫ‌క్రీ క‌నిపించ‌నుంది.

follow us