పవన్ విదేశీ టూర్..?

పవన్ విదేశీ టూర్..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొద్దీ రోజుల పాటు విదేశాల్లో గడపబోతున్నాడా..? అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు.ఓ పక్క సినిమాలు , మరోపక్క రాజకీయాల తో క్షణం తీరిక లేకుండా పవన్ కళ్యాణ్ గడుపుతున్న సంగతి తెలిసిందే. వారాంతంలో ఆరు రోజులు షూటింగ్ ..ఓ రోజు ఏపీ పర్యటన తో గడుపుతున్నాడు. పవన్ పడుతున్న కష్టం చూసి కుటుంబ సభ్యులే కాదు అభిమానులు సైతం కాస్త రెస్ట్ తీసుకోవచ్చు కదా అని అంటున్నారు. కాగా ఇప్పుడు కొద్దీ రోజులుగా ఆయన రష్యాలో గడపబోతున్నట్లు తెలుస్తుంది.

ప్రతి ఏడాది క్రిస్మస్ సందర్భంగా పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా తన పుట్టిల్లు అయినా రష్యా కి వెళ్తుందని సంగతి తెలిసిందే. అక్కడ కొన్ని రోజులు ఉండి, పండగ జరుపుకున్న తర్వాత మళ్ళీ తిరిగి ఇండియా కి వస్తుంది. ఇప్పుడు కూడా ఆమె రష్యా లో గత కొద్దీ రోజుల నుండి ఉంటుంది. ఎన్ని పనులు ఉన్నా పవన్ కళ్యాణ్ క్రిస్మస్ సెలవలు వచ్చినప్పుడు మాత్రం తన భార్య పిల్లలతో గడపడానికి రష్యా కి వెళ్తుంటాడు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ తిరిగి వస్తాడు. ఇప్పుడు కూడా ఆయన రష్యా కి పయనం అవ్వబోతున్నాడట..మళ్ళీ తిరిగి వచ్చే గురువారం రోజు ఇండియా కి వస్తాడని..రాగానే ‘హరి హర వీరమల్లు’ సినిమాకి సంబంధించిన కొత్త షెడ్యూల్ లో పాల్గొనబోతున్నాడని అంటున్నారు. మరి దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

follow us